MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Q2 results: అదరగొట్టిన అపోలో హాస్పిటల్స్, జీ ఎంటర్టైనేమేంట్, అపోలో టైర్స్.. అంచనాలకు ధీటుగా ఫలితాలు..

Q2 results: అదరగొట్టిన అపోలో హాస్పిటల్స్, జీ ఎంటర్టైనేమేంట్, అపోలో టైర్స్.. అంచనాలకు ధీటుగా ఫలితాలు..

 అపోలో హాస్పిటల్స్ లిమిటెడ్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నెట్  ప్రాఫిట్  సంవత్సరానికి 14.2 శాతం (YoY) పెరిగి రూ. 233 కోట్లకు చేరుకుంది, అయితే అంచనాల కంటే తక్కువగా ఉంది. అయితే, హాస్పిటల్  ఆపరేటర్ అంచనాల కంటే మెరుగైన ఆదాయాన్ని రూ. 4,846.9 కోట్లుగా నివేదించారు, దింతో  14 శాతం వార్షిక పెరుగుదలను చూపిస్తుంది.  

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 10 2023, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 అపోలో హాస్పిటల్స్ లిమిటెడ్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నెట్  ప్రాఫిట్  సంవత్సరానికి 14.2 శాతం (YoY) పెరిగి రూ. 233 కోట్లకు చేరుకుంది, అయితే అంచనాల కంటే తక్కువగా ఉంది.

అయితే, హాస్పిటల్  ఆపరేటర్ అంచనాల కంటే మెరుగైన ఆదాయాన్ని రూ. 4,846.9 కోట్లుగా నివేదించారు, దింతో  14 శాతం వార్షిక పెరుగుదలను చూపిస్తుంది.

ఆరు బ్రోకరేజీల పోల్ ప్రకారం, హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ కలిపి నికర లాభం రూ. 238.90 కోట్లు, ఆదాయం రూ. 4,792.30 కోట్లుగా ఉంటుందని అంచనా వేయబడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో EBITDA మార్జిన్ 12.9 శాతం తక్కువగా ఉంది, ఏడాది క్రితం ఇదే కాలానికి 13.3 శాతంగా ఉంది.

డయాగ్నోస్టిక్స్ అండ్ రిటైల్ హెల్త్‌కేర్ వింగ్ అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్ గ్రాస్ రెవెన్యు  రూ. 354.2 కోట్లుగా నివేదించింది, అయితే  సంవత్సరానికి 11 శాతం పెరిగింది.

అనుబంధ సంస్థ ఆఫ్‌లైన్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్  ఆదాయాలను రూ. 1,714.3 కోట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌కు రూ. 231.2 కోట్లుగా నివేదించింది. మొత్తం హెల్త్ కో రాబడులు రూ. 1,945.4 కోట్లుగా ఉన్నాయి, అయితే 17 శాతం YoY వృద్ధిని సూచిస్తుంది.
 

34

అపోలో టైర్స్
 అపోలో టైర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్) ఫలితాలను తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం దాదాపు రెండున్నర రెట్లు పెరిగి రూ.474.26 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. రాబడి పెరగడం,   ముడిసరుకు ధరలు తగ్గడం కంపెనీ లాభాలను పెంచడానికి దోహదపడింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.179.39 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

అపోలో టైర్స్ ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.6,279.67 కోట్లకు పెరిగింది, అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,956.05 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వినియోగించిన మెటీరియల్స్ ధర రూ.3,101.56 కోట్ల నుంచి రూ.2,634.92 కోట్లకు తగ్గిందని కంపెనీ పేర్కొంది.

గత ఏడాది రూ.5,724.66 కోట్లతో పోలిస్తే మొత్తం ఖర్చులు కూడా రూ.6,612.81 కోట్లకు తగ్గాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ కన్వర్ మాట్లాడుతూ, "మా వ్యాపారం సానుకూల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది ఇంకా  భవిష్యత్తులో డిమాండ్‌లో మరింత మెరుగుదలని సూచిస్తూ, ముఖ్యంగా భారతదేశం నుండి ప్రోత్సాహకరమైన సంకేతాలను చూస్తున్నాము."అని అన్నారు. 

గత నెలలో కంపెనీ షేర్లు 3.73 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దీని షేర్ల ధర దాదాపు 17.27 శాతం పెరిగింది.

44

Zee ఎంటర్‌టైన్‌మెంట్(ZEEL)
Zee ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ గురువారం సెప్టెంబర్ 30 2023తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 9% పెరిగి రూ.123 కోట్లకు చేరుకుందని నివేదించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ.113 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

మీడియా సంస్థ మొత్తం ఆదాయం Q2FY23లో రూ. 2,040 కోట్ల నుంచి Q2FY24లో 23% పెరిగి రూ.2,510 కోట్లకు చేరుకుంది. Q2FY23లో రూ.2,024 కోట్లతో పోలిస్తే Q2FY24లో సంస్థ ఆదాయం 20% పెరిగి రూ.2,438 కోట్లకు చేరుకుంది.

గురువారం, BSEలో ZEEL స్క్రిప్ 1% లాభంతో రూ.262.8 వద్ద ట్రేడింగ్ ముగిసింది. జీ టీవీ అండ్ జీ సినిమాతో సహా టీవీ ఛానెల్‌లు  ఉన్న కంపెనీ, సంవత్సర ప్రాతిపదికన  సబ్‌స్క్రిప్షన్ ఆదాయంలో 8% పెరుగుదలను నమోదు చేసింది.

ఇతర సేల్స్  అండ్  సర్వీస్  ఆదాయం 201% పెరిగింది, ఇంకా దేశీయ ప్రకటనల ఆదాయం 2.1% క్షీణించినప్పటికీ, "గదర్ 2"తో సహా   సినిమాల అధిక సిండికేషన్,  బలమైన థియేట్రికల్ పెర్ఫార్మెన్స్‌తో సహాయపడింది. సినిమాల్లో అధిక కంటెంట్ ఖర్చులు, ZEE5, దాని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో పెట్టుబడి కారణంగా Zee మొత్తం ఖర్చులు 23% పెరిగాయి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
బంగారు బిస్కెట్లపై గోల్డ్‌ లోన్ ఎందుకు ఇవ్వ‌రో తెలుసా.? అస‌లు కార‌ణం ఏంటంటే?
Recommended image2
EPFO: ఈపీఎఫ్ఓ బంపర్ ఆఫర్.. వాట్సాప్‌లోనే పీఎఫ్, పెన్షన్ అప్‌డేట్స్.. ఎలా చూడాలంటే?
Recommended image3
Post Office Scheme: రిటైర్‌మెంట్ తర్వాత నెలకు 20 వేల ఆదాయం.. పోస్టాఫీసు సూపర్ సేవింగ్ స్కీమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved