MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Business
  • రూ.5 లక్షలు రూ.15 లక్షలయ్యే సూపర్ స్కీమ్ ఇదిగో

రూ.5 లక్షలు రూ.15 లక్షలయ్యే సూపర్ స్కీమ్ ఇదిగో

మీరు పెట్టే పెట్టుబడి ఎంతైనా మూడు రెట్లు రిటర్న్స్ వస్తాయంటే మీకు ఆనందమే కదా.. అందుకే ఇక్కడ అలాంటి బెస్ట్ స్కీమ్ గురించి వివరాలు తెచ్చాం. ఈ స్కీమ్ లో మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే రూ.15 లక్షలు పొందొచ్చు. అద్భుతమైన ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 10 2025, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

తల్లిదండ్రులంతా శక్తికి మించి కష్టపడుతుంటారు. ఎందుకంటే వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, వారి అవసరాలు తీర్చాలని. ఆర్థికంగా పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని తపన పడుతుంటారు. అయితే పెరుగుతున్న ఖర్చులు, అవసరాల వల్ల సంపాదించిందంతా ప్రస్తుత అవసరాలు తీర్చడానికే సరిపోతుంది. అయితే కొంచెమైనా సేవింగ్స్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు ప్లాన్ చేయాలంటే మీరు ఇప్పుడే మంచి స్కీమ్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలి. పోస్టాఫీసులో అలాంటి సూపర్ స్కీమ్ ఉంది. వివరాలు తెలుసుకుందాం రండి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పిల్లలు పుట్టగానే కొంతమంది తల్లిదండ్రులు PPF, RD, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెడతారు. మరికొందరు పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడతారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడినిచ్చే పోస్టాఫీస్ స్కీమ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఈ పథకంలో ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మీరు చివరిగా 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

35

పోస్టాఫీస్ FDలో పెట్టుబడి పెట్టండి

మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకుంటే పోస్టాఫీస్ FD మంచి ఆప్షన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి మీ పెట్టుబడికి భరోసా ఉంటుంది. ఇందులో 5 సంవత్సరాల FDపై మంచి రాబడి వస్తుంది. బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేట్లు ఇస్తుంది. ఈ పథకం ద్వారా మీరు ఐదు లక్షల రూపాయలు పెడితే 180 నెలల్లో 15 లక్షల రూపాయలు పొందవచ్చు.

45

రూ.5 లక్షలు రూ.15 లక్షలుగా..

రూ.5 లక్షలను రూ.15 లక్షలుగా మార్చడం కష్టమేమీ కాదు. ఇలా అవ్వాలంటే మీరేం చేయాలంటే.. రూ.5 లక్షలను 5 సంవత్సరాల పోస్టాఫీస్ FDలో పెట్టుబడి పెట్టండి. పోస్టాఫీస్ 5 సంవత్సరాల FDకి 7.5% వడ్డీనిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ.7,24,974 అవుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి మరో 5 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టండి. ఈ విధంగా 10 సంవత్సరాలలో రూ.5 లక్షలపై వడ్డీ రూ.5,51,175 అవుతుంది. మొత్తం రూ.10,51,175 అవుతుంది.

55

రూ.10,51,175 మొత్తాన్ని మళ్ళీ 5 సంవత్సరాలకు పెట్టుబడి పెట్టండి. అంటే మొత్తం 15 సంవత్సరాలు మీ డబ్బు పెట్టుబడిగానే ఉంటుంది. 15వ సంవత్సరంలో మెచ్యూరిటీ అయినప్పుడు రూ.5 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ.10,24,149 అవుతుంది. మొత్తం 15 సంవత్సరాలకు రూ.15,24,149 మీకు అందుతాయి.

బ్యాంకుల్లాగే పోస్టాఫీసుల్లో కూడా వివిధ టెన్యూర్ ఉన్న FDలు ఉన్నాయి. ప్రతి కాలానికి వేర్వేరు వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 
1 సంవత్సరం: 6.9%
2 సంవత్సరాలు: 7.0%
3 సంవత్సరాలు: 7.1%
5 సంవత్సరాలు: 7.5%

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి రేట్లు మళ్లీ దూకుడు.. గంటల్లోనే మారిన మార్కెట్.. కొనాలా? ఆగాలా?
Recommended image2
Investment: మీ రిటైర్మెంట్ సేవింగ్స్‌లోగ్యారంటీడ్ ప్లాన్లలో.. ఎంత భాగం పెట్టాలో తెలుసా.?
Recommended image3
Gold Price Crash: అమెరికా-ఇరాన్ మధ్య ట్యాంకర్ వార్....కుప్పకూలిన పసిడి, వెండి..ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved