PM Kisan Scheme:రైతులకు బిగ్ రిలీఫ్.. E-KYC చేయడానికి చివరి తేదీ పొడిగింపు..
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో రైతులకు ఉపశమనం ఇస్తూ e-KYC ప్రక్రియను చేయడానికి ప్రభుత్వం అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు దీన్ని చేయడానికి చివరి తేదీ మే 31గా నిర్ణయిం చారు, ఇప్పుడు 31 జూలై 2022 వరకు పొడిగించింది. ఈ సమాచారం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఈ -కేవైసీని పూర్తి చేయడం చాలా ముఖ్యం
ఈ పథకం కింద 11వ విడతను మే 31న రైతుల ఖాతాకు ప్రధాని నరేంద్ర మోదీ బదిలీ చేశారు. గతేడాది రికార్డులను పరిశీలిస్తే.. గతేడాది మే 15న ఏప్రిల్-జూలై విడతలు వచ్చాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రయోజనాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా పొందాలంటే చాలా వరకు ఇ-కెవైసిని పూర్తి చేయడం అవసరం. ఇ-కెవైసి చేయకపోతే రైతులు పథకం ప్రయోజనాలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
12 కోట్ల మంది రైతులు రిజిస్టర్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దాదాపు 12.53 కోట్ల మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇ-కెవైసి తప్పనిసరి చేసింది. దీన్ని ఇ-కెవైసి చేయకుంటే ఈ పథకం కింద అందించే ఆర్థిక సహాయం లభించదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు 11 వాయిదాలను ప్రభుత్వం పంపిణీ చేసింది.
ప్రభుత్వం సంవత్సరానికి రూ.6000 పంపుతుంది
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏటా రూ.6,000 నేరుగా రైతుల ఖాతాలకు పంపుతుంది. ఈ డబ్బును ప్రభుత్వం రైతులకు మూడు విడతలుగా విడుదల చేస్తుంది. ఒక్కో విడతలో రైతులకు రూ.2వేలు అందజేస్తున్నారు. ఈ పథకం కింద ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రైతులకు మొదటి విడత డబ్బులను అందజేస్తారు. రెండవ విడత డబ్బు ఆగస్టు 1 నుండి నవంబర్ 30 మధ్య బదిలీ చేయబడుతుంది. అయితే, పథకం మూడవ విడత డబ్బు డిసెంబర్ 1 నుండి మార్చి 31 మధ్య బదిలీ చేయబడుతుంది. దీని ప్రకారం ఏప్రిల్ మొదటి వారంలో 11వ విడత డబ్బును రైతుల ఖాతాలో జమ చేస్తుంది.
ఈ రైతులకు ప్రయోజనం లేకుండా పోతుంది
మీరు చిన్న లేదా సన్నకారు రైతు అయినప్పటికీ కుటుంబ సభ్యుడు పన్ను చెల్లింపుదారుడు అయితే మీరు ఈ పథకం ప్రయోజనం పొందలేరు. కుటుంబ సభ్యుడు అంటే భర్త, భార్య అండ్ మైనర్ పిల్లలు. అంతేకాకుండా సాగు భూమి లేనివారు, సాగు భూమి ఉన్నవారు కానీ దాని యజమాని ప్రభుత్వ ఉద్యోగి లేదా రైతు సంవత్సరానికి రూ. 10,000 పింఛను పొందుతున్నట్లయితే అటువంటి రైతులు పథకం నుండి మినహాయించబడ్డారు.
ఇలా e-KYC పూర్తి చేయండి
మొదట https://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇప్పుడు హోమ్‌పేజీలో కనిపించే eKYC లింక్ కిసాన్ కార్నర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఇక్కడ అడిగిన సమాచారాన్ని ఎంటర్ చేయండి.
ఇప్పుడు సబ్మిట్‌పై క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది.
మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఇప్పుడు 'ఫార్మర్స్ కార్నర్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, గ్రామం పేరు ఎంటర్ చేయండి.
ఆ తర్వాత 'గెట్ రిపోర్ట్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఫుల్ లిస్ట్ ఓపెన్ అవుతుంది.
ఈ లిస్ట్ లో మీరు మీ ఇన్‌స్టాల్‌మెంట్ వివరాలను చూడవచ్చు.
స్టేటస్ కోసం
https://pmkisan.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇప్పుడు హోమ్‌పేజీలో కనిపించే రైతుల కార్నర్ ఎంపికపై క్లిక్ చేయండి.
దీని తర్వాత కనిపించే బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆధార్, బ్యాంక్ అక్కౌంట్ లేదా మొబైల్ నంబర్ ఆప్షన్ ఎంచుకోండి.
మీరు వివరాలను ఎంటర్ చేసి, గెట్ డాటా పై క్లిక్ చేయండి.
ఇప్పుడు అన్ని లావాదేవీల వివరాలు మీ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది.