MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • ఒక్కసారిగా పడిపోయిన క్రూడాయిల్.. అయినా దిగిరాని పెట్రోల్-డీజిల్.. సామాన్యుడు లీటరుకు ఎంత ఖర్చు చేయాలంటే..?

ఒక్కసారిగా పడిపోయిన క్రూడాయిల్.. అయినా దిగిరాని పెట్రోల్-డీజిల్.. సామాన్యుడు లీటరుకు ఎంత ఖర్చు చేయాలంటే..?

భారతీయ ఆయిల్ కంపెనీలు అక్టోబర్ 5 గురువారం రోజున పెట్రోల్,  డీజిల్ ధరలను చిన్న చిన్న సవరణలతో అన్ని ప్రముఖ  నగరాల్లో దాదాపు ఒకే స్థాయిలో కొనసాగించాయి. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

2 Min read
Author : Ashok Kumar
| Updated : Oct 05 2023, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

90 డాలర్లు దాటిన తర్వాత క్రూడాయిల్ ధరల్లో భారీ పతనం నమోదైంది. క్రూడాయిల్ బుధవారం బ్యారెల్‌కు 3 డాలర్లకు పైగా పడిపోయింది. మరోవైపు మాంద్యం భయాల కారణంగా ఈ ఏడాది చివరి వరకు క్రూడాయిల్ ఉత్పత్తిని తగ్గించాలని సౌదీ అరేబియా, రష్యా నిర్ణయించాయి.  

 గురువారం ఉదయం క్రూడాయిల్  ధరలలో పెరుగుదల కనిపించింది. క్రూడాయిల్  WTI బ్యారెల్‌కు 0.20 శాతం లేదా $ 0.17  డాలర్ పెరిగి $84.39 వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ క్రూడాయిల్   0.29 శాతం లేదా $0.25 పెరుగుదలతో బ్యారెల్‌కు $ 86.05 వద్ద ట్రేడవుతోంది.

36

మహారాష్ట్రలో పెట్రోల్ ధర 64 పైసలు  అలాగే డీజిల్ ధర 62 పైసలు తగ్గింది. హర్యానాలో పెట్రోల్ 24 పైసలు, డీజిల్ 23 పైసలు తగ్గాయి. అలాగే జార్ఖండ్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 26 పైసలు తగ్గాయి.  మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో పెట్రోలు ధర 48 పైసలు, డీజిల్ ధర 45 పైసలు పెరిగింది. పంజాబ్‌లో కూడా పెట్రోల్‌  36 పైసలు, డీజిల్‌  34 పైసలు  ఎగిశాయి.

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

46

భారతదేశంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం అండ్ హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్   డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.
 

56

ఇంధన ధరలు ఎందుకు మారుతున్నాయి?

ప్రతి రోజు ధరలు కొత్తవి లేదా మారకపోయినా  ఉదయం 6 గంటలకు ప్రకటించబడతాయి. అయితే ఇవి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి; అలాగే వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన ప్రమాణాల కారణంగా ఉంటుంది.

66

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved