OYO Rooms: ఓయో రూమ్స్ బుకింగ్ లో టాప్ 1 సిటీ ఏదో తెలుసా? అది తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది
OYO Rooms: ఓయో రూమ్స్ ఇటీవల ఎంత ఫేమస్ అయ్యాయో అందరికీ తెలుసా కదా? అయితే ఇండియా మొత్తం మీద ఓయో రూమ్స్ ఎక్కువగా బుక్ అయ్యే సిటీ ఏదో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ సిటీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అంతేకాకుండా ఓయో రూమ్స్ ఎక్కువగా బుక్ అయ్యే సిటీస్ లో టాప్ 10 లో ఆంధ్రా, తెలంగాణకు చెందిన మరో రెండు సిటీస్ కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

OYO అంటే On Your Own. ఈ ఓయో కాన్సెప్ట్ ను 2013లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. రితేష్ అగర్వాల్ తన ట్రావెలింగ్ సమయంలో ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టిన మంచి ఫెసిలిటీస్ ఉన్న హోటల్స్ లభించకపోవడాన్ని గమనించారు. అందువల్ల తక్కువ ధరలో మెరుగైన హోటల్ సేవలు అందించాలనే ఆలోచనతో OYO ను ప్రారంభించారు.
ముఖ్యంగా మధ్య తరగతి ప్రయాణికులకు తక్కువ ధరలో శుభ్రమైన, సురక్షితమైన, వసతులు కలిగిన గదులను అందించాలనే లక్ష్యంతో ఈ మోడల్‌ను రూపొందించారు.
OYO హోటళ్లను బ్రాండింగ్ చేయడం ద్వారా అన్ని నగరాల్లో ఒకే విధమైన వసతులు అందించడానికి ప్రయత్నించింది. దీనివల్ల ప్రతి వినియోగదారునికి ఒకే విధమైన అనుభవం లభించేది.
OYO ఒక ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫాంగా మారింది. కేవలం మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా తక్కువ సమయంలో హోటల్ గదులను బుక్ చేసుకోవచ్చు. OYO చిన్న హోటళ్లను తన బ్రాండ్‌తో కలిపి వారికి మార్కెటింగ్ చేయడం, టెక్నాలజీ సపోర్ట్ అందించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే విధంగా పని చేసింది.
OYO మొదట బడ్జెట్ హోటళ్ల కోసం ప్రారంభించనా తరువాత OYO Townhouse, OYO Flagship, OYO Homes లాంటి విభాగాలను ప్రవేశపెట్టింది. ఇలా భారతదేశం లోనే కాకుండా OYO యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, దుబాయ్, మలేషియా లాంటి అనేక దేశాలలో కూడా తన సేవలను విస్తరించింది.
ఓయో సంస్థ విడుదల చేసిన ట్రావెలోపీడియా రిపోర్ట్ తో పాటు రిసెంట్ డేటా ప్రకారం ఇండియాలో ఓయో రూమ్స్ బుకింగ్స్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఉన్నాయి. చిన్న పట్టణాల విభాగంలో గుంటూరు, వరంగల్ టాప్ 5లో ఉన్నాయి.