మీ పిల్లలకు రూ.కోట్లు ఇవ్వాలనుకుంటే NPS వాత్సల్య యోజనలో చేర్చండి
కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం కొత్త పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. దీని పేరు NPS వాత్సల్య యోజన. ఇందులో మీ పిల్లల పేరున పెట్టుబడి పెడితే వారి భవిష్యత్తుకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎలా ఆదాయం లభిస్తుంది? తదితర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. సంపాదనలో కొత్త దాచి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తుంటారు. మీరు కూడా అలా చేయాలనుకుంటే వాత్సల్య యోజన పథకం మీకు మంచి ఆలోచన. ఇందులో మీకు చాలా తక్కువ పెట్టుబడితో పిల్లలకు భవిష్యత్తులో ఓ మంచి అమౌంట్ ని ఇవ్వవచ్చు.
కేంద్ర ప్రభుత్వం పిల్లల కోసం NPS వాత్సల్య యోజన అనే పెన్షన్ పథకాన్ని 2024లో ప్రారంభించింది. ఈ పథకం పిల్లలకు ఎన్నో బెనిఫిట్స్ అందిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైన డబ్బును కొంచెం కొంచెంగా ఆదా చేయడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
NPS వాత్సల్య యోజన పథకం సెప్టెంబర్ 18, 2024 నుండి అమలులోకి వచ్చింది. ఈ పథకంలో 18 సంవత్సరాలలోపు పిల్లలను చేరి వారి తల్లిదండ్రులు కాని, గార్డియన్ గాని పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ అకౌంట్ పై పిల్లలకు అధికారం వస్తుంది. వారు ఆ అమౌంట్ ను తల్లిదండ్రుల సహాయంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించవచ్చు.
ఈ పథకం కింద తల్లిదండ్రులు సంవత్సరానికి కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. అంతకు మించి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు తల్లిదండ్రులు, గార్డియన్స్ పెట్టుబడి పెట్టాలి. 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా పిల్లల అంగీకారంతో ఈ స్కీమ్ లో పెట్టుబడులను కొనసాగించవచ్చు. లేదా పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లి ఇలా అవసరాలకు వాత్సల్య యోజనలో పెట్టిన పెట్టుబడిని 80 శాతం వరకు తీసుకోవచ్చు.
వాత్సల్య యోజనలో పెట్టుబడిని మీరు గాని 60 ఏళ్ల వరకు కొనసాగిస్తే 10% రాబడి రేటుతో రూ.2.75 కోట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది పిల్లల భవిష్యత్తును మాత్రమే కాకుండా క్రమశిక్షణతో కూడిన ఆదా అలవాట్లను కూడా ప్రోత్సహిస్తుంది.
పిల్లల వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా సాధారణ NPS ఖాతాకు మార్చబడుతుంది. అప్పుడు 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఆ తర్వాత మీరు 25% మొత్తాన్ని 3 సార్లు ఉపసంహరించుకోవచ్చు.
వాత్సల్య యోజనలో చేరాలంటే ఈ డాక్కుమెంట్లు అవసరం. పిల్లల జనన ధృవీకరణ పత్రం, పాఠశాల బదిలీ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, తండ్రి లేదా తల్లి లేదా సంరక్షకుడి ID, PAN, పాస్‌పోర్ట్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ గార్డియన్ NRI అయితే NRE/NRO బ్యాంక్ ఖాతా ఉండాలి.
మీ పిల్లలకు భవిష్యత్తులో ఆర్థిక భరోసా ఇవ్వాలనుకుంటే NPS వాత్సల్య యోజన పథకంలో పెట్టుబడి పెట్టడం మంచి ముందడుగు అవుతుంది.