నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ కావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసా?
రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం పొందాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి ప్లాన్ చేసుకోకపోతే రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత నికర ఆదాయం పొందాలంటే మీకు జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) ఒక గొప్ప ఆదాయ మార్గం అవుతుంది. ఈ పథకంలో పెట్టుబడికి తగ్గట్టుగా పెన్షన్ లభిస్తుంది. మీరు గాని నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ పొందాలనుకుంటే ఎలా పెట్టుబడి పెట్టాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఉద్యోగం చేయడంతో పాటు భవిష్యత్తును భద్రపరచుకోవాలనే ఆందోళన కూడా మనకు ఉంటుంది. రోజు రోజుకూ పెరుగుతున్న ఖర్చులు, సరిపోని ఆదాయాల వల్ల భవిష్యత్తు మరింత భయంగా కనిపిస్తుంది కదా... ఇలాంటి పరిస్థితుల్లో సేవింగ్స్ కి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది? ఇవి కాకుండా పదవీ విరమణ తర్వాత ఖర్చుల గురించి కూడా ఆందోళన ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీరు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మీరు జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీకు జీవిత కాల భరోసాని అందిస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల నికర ఆదాయాన్ని అందిస్తుంది. అది కూడా ఖర్చులకు సరిపోయేలా కాకుండా కాస్త ఎక్కువగానే మీరు పొందడానికి అవకాశం ఈ స్కీమ్ లో ఉంటుంది.
NPSలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తాన్ని పొదుపు చేయవచ్చు. మీరు కోరుకుంటే రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రతి నెలా రూ.1.5 లక్షల పెన్షన్ పొందవచ్చు. అవును.. జాతీయ పెన్షన్ సిస్టమ్‌లో పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. రూ.1.5 లక్షల నెలవారీ పెన్షన్ పొందడానికి మీరు NPSలో ఎంత పెట్టుబడి పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.
నెలకు రూ.1.5 లక్షల పెన్షన్ పొందడానికి ప్రతి నెలా మీరు రూ.7,000 పెట్టుబడి పెట్టాలి. దీనికి NPS వార్షిక రాబడి సుమారు 12 శాతం ఉంటుంది. ఇలా మీరు 25 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.7,000 పెట్టుబడి పెడితే 25 సంవత్సరాల తర్వాత మొత్తం రూ.29,40,000 అవుతుంది. ఈ పెట్టుబడిపై 12 శాతం లాభం వస్తే, సుమారు రూ.4.54 కోట్లు మీరు సేవ్ చేసినట్లు అవుతుంది.
రూ.4.54 కోట్ల నిధిలో 40 శాతం నగదును మీరు పెన్షన్ ప్లాన్(అన్యుటీ) లో పెట్టుబడి పెట్టాలి. మిగిలిన 60 శాతం నిధిని మీరు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ మొత్తాన్ని మీరు సొంత ఖర్చులు, అవసరాలకు ఉఫయోగించుకోవచ్చు. ఇక మిగిలిన 40 శాతం అమౌంట్ పెన్షన్ ప్లాన్ లో పెట్టిన తర్వాత మీరు ప్రతి నెలా మీరు సుమారు 1.5 లక్షల రూపాయలు పెన్షన్ గా మీరు పొందుతారు.
జాతీయ పెన్షన్ సిస్టమ్ ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. 40 శాతం నగదును పెన్షన్ ప్లాన్ లో పెట్టగా 60 శాతం నిధిని మీరు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ మొత్తానికి మీరు ఎలాంటి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.
ఆదాయపు పన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు టాక్స్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఇది కాకుండా సెక్షన్ 80CCD (1B) కింద రూ. 50,000 వరకు వార్షిక పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అందరికీ ఎంతో ఉపయోగపడే ఈ స్కీమ్ లో ఇప్పటి నుంచే మీరు పెట్టుబడి పెట్టండి.