- Home
- Business
- ఇకపై చెక్ డబ్బులు పడేందుకు రెండు రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్బిఐ నియమాలు మార్చేసింది
ఇకపై చెక్ డబ్బులు పడేందుకు రెండు రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్బిఐ నియమాలు మార్చేసింది
ఎవరైనా చెక్కును బ్యాంకులో జమ చేస్తే రెండు రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొన్ని గంటలు చాలు. చెక్కు క్లియరెన్స్ నియమాలను ఆర్బిఐ మార్చింది.

చెక్ డిపాజిట్ నియమాలు
చెక్ డిపాజిట్ చేసిన వారు బ్యాంకు రెండు వరుస పని దినాలు వరకు వేచి ఉండాల్సి వచ్చేది. అంటే చెక్కు వేశాక రెండు రోజులకు గాని ఆ డబ్బులు మీ అకౌంట్లో పడేవి కాదు. అప్పుడే మీ చెక్ క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆర్బిఐ నియమాలు మార్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు క్లియరెన్స్ నియమాలు మార్చాలని నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 4 నుండి ఈ నియమాలు అందుబాటులోకి వస్తాయి. చెక్ క్లియరెన్స్ కోసం మీరు రెండు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే చెక్ లోనే డబ్బులు మీ ఎకౌంట్లో జమవుతాయి.
రిజర్వ్ బ్యాంక్ ప్రకటన
రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో చెక్ ట్రంకేషన్స్ సిస్టంను నిరంతర క్లియరింగ్ సెటిల్మెంట్ ఆన్ రిలేషన్ గా మారుస్తున్నట్టు ప్రకటించింది. ఇలా చేయడం వల్ల చెక్ క్లియరింగ్ చేయడానికి పట్టే రెండు రోజులు సమయాన్ని ఇది కొన్ని గంటలకే తగ్గించేస్తుంది. చెక్కు క్లియరెన్స్ సిస్టంలో వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఈ పని చేసింది.
అక్టోబర్ 4 నుంచి
ఆర్బిఐ చెబుతున్న ప్రకారం అక్టోబర్ 4 నుండి ఈ నియమం అందుబాటులోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు చెక్కును బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఆ చెక్కును స్కాన్ చేసి క్లియరింగ్ హౌస్ కు పంపిస్తుంది. దీని తర్వాత క్లియరింగ్ హౌస్ ఆ చెక్కు ఫోటోను నగదు జమ చేసే బ్యాంకుకు పంపుతుంది. ఇక కన్ఫర్మేషన్ సెషన్ ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తుంది. ఇది కన్ఫర్మేషన్ ఇస్తే చాలు మీ ఖాతాలో డబ్బు పడిపోతుంది.
దీనివల్ల ఎన్నో లాభాలు
చెక్కు క్లియరెన్స్ లు కొన్ని గంటలకే కుదించడం వల్ల ఎంతో మంది లాభం పొందుతారు. అత్యవసర సమయాల్లో కూడా చెక్కు డబ్బుల కోసం రెండు రోజులపాటు వేచి ఉండాల్సిన పద్ధతికి ఇది స్వస్తి పలుకుతుంది. ఈరోజు మీరు చెక్ వేస్తే కొన్ని గంటల్లో అది ఖాతాలోకి జమ అయిపోతుంది. ఇది భారతదేశంలోని ఎంతోమంది ప్రజలకు ఉపయోగకరమైనదని చెప్పుకోవాలి.