UPI Transactions: ఫిబ్రవరి 15 నుంచి యూపీఐ లావాదేవీల్లో కొత్త మార్పులు
UPI Transactions: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 15 నుండి UPI లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఈ మార్పులు ప్రధానంగా చార్జ్‌బ్యాక్‌ల ప్రాసెసింగ్‌కు సంబంధించినవి. NPCI ఇప్పుడు ఆటోమేటిక్ ఛార్జ్‌బ్యాక్ ఆమోదం, తిరస్కరణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ సమాచారం గురించి మరింత వివరంగా తెలుసుకుందాం రండి.

NPCI (National Payments Corporation of India) UPI లావాదేవీలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా Transaction Credit Confirmation (TCC) మరియు Returns ఆధారంగా ఆటోమేటిక్ ఛార్జ్‌బ్యాక్ ఆమోదం లేదా తిరస్కరణ చేయడానికి ఈ మార్గదర్శకాలు రూపొందించింది.

ఛార్జ్‌బ్యాక్ అంటే ఏమిటి?
ఛార్జ్‌బ్యాక్ అనేది UPI లావాదేవీలలో ఒక ముఖ్యమైన ప్రక్రియ. అంటే ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అందులో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందేందుకు చేసే ప్రక్రియనే ఛార్జ్ బ్యాక్ అంటారు. ఇది చాలాసార్లు ట్రాన్సాక్షన్ టైమ్ లో డబ్బు పంపిన బ్యాంక్ (Remitting Bank) ఈ ప్రక్రియను చేస్తుంది. కానీ అందుకున్న బ్యాంక్ (Beneficiary Bank) ఈ లావాదేవీని తనిఖీ చేసేందుకు ముందుగా అవకాశం పొందదు. ప్రస్తుతం ఉన్న విధానంలో పంపిన బ్యాంక్ లావాదేవీ జరిగిన రోజు నుండి URCS (Unified Real-time Clearing and Settlement) ద్వారా ఛార్జ్‌బ్యాక్‌ను ప్రారంభించగలదు.
సమస్య ఎక్కడ ఉంది?
మనీ ట్రాన్స్ ఫర్ లో ప్రాబ్లమ్ ను పరిష్కరించేందకు ఛార్జ్‌బ్యాక్ ప్రక్రియ ను అదే రోజున ప్రారంభించే అవకాశం ఉన్నందున లావాదేవీని అందుకున్న బ్యాంక్ (Beneficiary Bank) వెంటనే తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే అనేక కారణాల వల్ల సరిగ్గా చెక్ చేయకుండా లావాదేవీని అందుకున్న బ్యాంక్ ‘Return’ ఇచ్చే అవకాశాలున్నాయి. అంటే ట్రాన్స్ ఫర్ చేసిన డబ్బు అందిందా, లేదా అన్న విషయం కన్ఫర్మ్ కాదు. ఇలాంటి సందర్భంలో కూడా ఛార్జ్ బ్యాక్ ఆమోదం పొందినట్లుగా రికార్డ్ అవుతోంది.
ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
ఈ సమస్యను పరిష్కరించడానికి NPCI ఇప్పుడు ఆటోమేటిక్ ఛార్జ్‌బ్యాక్ ఆమోదం/తిరస్కరణ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
లావాదేవీ అందుకున్న బ్యాంక్ తమ రిటర్న్‌ను (TCC/RET) అప్‌లోడ్ చేసిన తర్వాత తదుపరి సెటిల్‌మెంట్ సైకిల్‌లో ఆటోమేటిక్‌గా ఛార్జ్‌బ్యాక్ ఆమోదం లేదా తిరస్కరణ జరుగుతుంది.
అయితే ఈ ప్రక్రియ బల్క్ అప్ లోడ్(bulk upload) ఆప్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పులు 2025 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తాయి.
వినియోగదారులకు ఎలాంటి ప్రభావం
ఈ మార్పు ప్రధానంగా బ్యాంకుల మధ్య లావాదేవీల ప్రాసెసింగ్‌ను మెరుగుపరచడానికి ప్రవేశపెడుతున్నారు. దీని వల్ల వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ లావాదేవీల్లో స్పష్టత, వేగం పెరుగుతుంది.

