7 సీటర్ కార్లలో 35 కి.మీ. మైలేజ్ ఇచ్చే కారు ఇదొక్కటే
ఫ్యామిలీ మెన్ కారు కొనాలంటే కచ్చితంగా 7 సీటర్ కోసం వెతుకుతున్నారు. కుటుంబ అవసరాలు అలా పెరిగిపోయాయి. అందుకే అద్భుతమైన ఫీచర్లతో 7 సీటర్ కార్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. కస్టమర్ల అంచనాలకు మించి ఏకంగా 35 కి.మీ. మైలేజ్ ఇచ్చే కారును త్వరలో ఓ కంపెనీ మార్కెట్ లోకి తీసుకురానుంది. ఆ కంపెనీ ఏంటో? కొత్తగా మార్కెట్ లోకి రానున్న 7 సీటర్ కారు ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
కార్లు వాడటం ప్రారంభించిన తర్వాత చాలా మంది 5 సీటర్ కారు కొనుక్కొంటే చాలనుకొనేవారు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు కావడం, ఎంత దూరమైనా కారుల్లో ప్రయాణిస్తుండటంతో కంఫర్ట్ కోసం చాలా మంది 7 సీటర్ కారులనే ప్రిఫర్ చేస్తున్నారు. సాధారణంగా పెద్ద కారంటే మైలేజ్ తక్కువగానే వస్తుంది అని అందరికీ తెలుసు. 7 సీటర్ కార్లు మినిమం 12 కి.మీ. నుంచి మాక్సిమం 19 కి.మీ. మైలేజ్ ఇస్తుంటాయి. సైజులో పెద్దది కాబట్టి దానికి తగ్గట్టుగానే కారులో ఫెసిలిటీస్ అత్యాధునికంగా ఉంటున్నాయి. అందువల్ల మైలేజ్ తక్కువగా ఉన్నా ఫ్యామిలీ మెన్ 7 సీటర్ కార్లు కొనేందుకే ఇష్టపడుతున్నారు.
తక్కువ ధర కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. కస్టమర్లను ఆకర్షించడానికి ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి XL7 మోడల్ కారుని ప్రీమియం ఫీచర్స్ తో తీసుకొస్తోంది. బడ్జెట్ ధరలోనే పవర్ ఫుల్ ఇంజిన్ తో 2024 లో కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. మారుతి సుజుకి XL7 కారులో మంచి లుక్, ప్రీమియం ఫీచర్స్ ఉండటంతో కస్టమర్లకు నచ్చుతుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి.
మారుతి సుజుకి XL7 కారు ఇంజిన్, మైలేజ్
ఇండియన్ మార్కెట్ లో మారుతి సుజుకి XL7 కారు Ertiga కార్లతో పోటీ పడుతుంది. మారుతి XL7 కారులో 1.5 లీటర్ ఇంజిన్ ఉంది. ఇది 35 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇప్పటి వరకు ఉన్న 7 సీటర్ కార్లలో ఇదొక్కటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కావడం విశేషం.
మారుతి సుజుకి XL7 ప్రీమియం ఫీచర్స్
మారుతి సుజుకి XL7 కారులో చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ, cup హోల్డర్, రివర్స్ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి అనే సౌకర్యాలు ఇందులో కల్పిస్తున్నారు. ఇంత అత్యాధునిక టెక్నాలజీ ఉన్న కారు ఇంత తక్కువ ధరలో మీరు చూసి ఉండరు.
Maruti Suzuki XL7 ధర
Maruti Suzuki XL7 కారు ధర సుమారు రూ. 10 లక్షలు ఉంటుంది. 2024 లో కస్టమర్లకు బెస్ట్ ఆప్షన్ గా ఈ కారు మారుతుందని విశ్లేషకుల అంచనా.
మారుతి సుజుకి బ్రాండ్‌లో అందుబాటులో ఉన్న సెవెన్ సీటర్ కార్లు కొన్ని ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఫ్యామిలీ ఉపయోగం కోసం తయారు చేశారు. అందులో పేరు పొందిన కార్లు మారుతి ఎర్టిగా (Maruti Suzuki Ertiga), మారుతి XL6.
ఇతర కంపెనీలలో సెవెన్ సీటర్ కార్లు కొన్ని ఉన్నాయి. టయోటా ఇనోవా క్రిస్టా (Toyota Innova Crysta), మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio Classic/N), మహీంద్రా మారాజో (Mahindra Marazzo) , కియా కార్నివాల్ (Kia Carnival), రెనాల్ట్ ట్రైబర్ (Renault Triber) ఇవన్నీ సెవెన్ సీటర్ కార్లే. అయితే వీటన్నికంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు Maruti Suzuki XL7.