వేరే వాళ్ల ఫోటోలను మిస్ యూజ్ చేస్తున్నారా? శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా?
ఫోటోలను అసభ్యంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసేవారికి ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా? సరదా కోసమే ఇలా చేసినా ఫోటోలో ఉన్న వారు ఫీల్ అయితే మీకు కఠిన శిక్ష పడుతుంది. ఫొటోలు మిస్ యూజ్ చేస్తే విధించే శిక్షల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
సోషల్ మీడియా వల్ల ఎక్కడెక్కడో ఉన్న వారి ఫొటోలు, వీడియోలు కూడా ఈజీగా మనం చూడొచ్చు. అయితే కొందరు పరిచయం లేని వారి ఫొటోలను కూడా మార్ఫింగ్ చేయడం, మిస్ యూజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా? ముఖ్యంగా ప్రధాని, రాష్ట్రపతి ఫోటోలను వక్రీకరిస్తే జైలు శిక్షతో పాటు రూ.లక్షల్లో జరిమానా విధిస్తారు.
ఈ రోజుల్లో ఎవరి ఫోటోనైనా వక్రీకరించడం చాలా సులభం. ప్రతిరోజూ మొబైల్‌లో ఇలాంటి చిత్రాలను చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా AI ద్వారా ఏమైనా చేయొచ్చు. కానీ చట్ట ప్రకారం చాలా తప్పు.
ఎవరి ఫోటోనైనా మార్ఫింగ్ చేయడం, ఫేక్ చేయడం, అసభ్యంగా మార్చడం లాంటివి చేస్తే కఠిన శిక్ష పడుతుంది. సాధారణంగా యూత్ తమ క్లోజ్ ఫ్రెండ్స్ ఫోటోలను ఫన్ కోసం రకరకాలుగా మారుస్తారు. అయితే ఇది వారి మధ్యే ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడు అందరికీ ప్రతి ఫోటోను సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ లో షేర్ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది. అందువల్ల ఇలా సరదా కోసం మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్లు బాధపడే అవకాశం ఉంటుంది. అలా తమ ఫోటో మిస్ యూజ్ చేశారని బాధితులు కంప్లయింట్ చేస్తే చట్ట ప్రకారం మీకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా భారత ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను వక్రీకరిస్తే లేదా దుర్వినియోగం చేస్తే కఠిన శిక్ష తప్పదు. ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను వక్రీకరిస్తే ఎంత శిక్ష పడుతుందో మీకు తెలుసా?
చట్టం ఏం చెబుతుంది
దేశ జాతీయ చిహ్నాలు, లోగోలు, పేర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు చిహ్నాలు, పేర్ల దుర్వినియోగ నిరోధక చట్టం, 1950ని అమలు చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను మిస్ యూజ్ చేసే వారికి శిక్ష విధించే అవకాశం ఉంది.
ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను వక్రీకరిస్తే శిక్ష ఏమిటి?
చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఎవరి ఫోటోని అయినా మిస్ యూజ్ చేస్తే జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడవచ్చు. అయితే భారత రాష్ట్రపతి లేదా ప్రధాని ఫోటోను ఎవరైనా వక్రీకరిస్తే 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు 6 నెలల జైలు శిక్ష కూడా పడుతుంది.
చట్టంలో మార్పులు
ప్రధాని లేదా రాష్ట్రపతి ఫోటోలను దుర్వినియోగం చేస్తే గతంలో 1 లక్ష రూపాయల జరిమానా విధించేవారు. ఇప్పుడు చట్టంలో మార్పుల తర్వాత జరిమానాను రూ. 5 లక్షలకు పెంచారు. సరదా కోసం ఇలాంటి పనులు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ ప్రవర్తించకూడదు.