MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • రూ.7 లక్షల కారు రూ.5 లక్షలకే: MG Motors కొత్త స్కీమ్

రూ.7 లక్షల కారు రూ.5 లక్షలకే: MG Motors కొత్త స్కీమ్

ఎంజీ మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించింది. తన వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో చేరిన వారికి ఎంజీ మోటార్స్ జడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఈ పథకం ఏమిటి? అందులో ఎలా చేరాలి? దాని వల్ల కలిగే లాభాలు, తదితర వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 22 2024, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
MG Comet EV కారు

MG Comet EV కారు

ఎంజీ ZS EV BaaS ఎలక్ట్రిక్ వాహనం ఇప్పుడు మీకు తక్కువ ధరలో లభిస్తుంది. కామెట్ EVతో పాటు కంపెనీ MG ZS EV ధరను కూడా తగ్గించింది. అయితే కంపెనీ BaaS పథకం(బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్‌) కింద ఈ వాహనాలను కొనుగోలు చేస్తేనే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. BaaS విధానంలో MG మోటార్స్ MG Windsor అనే ఎలక్ట్రిక్ మోడల్ ను విడుదల చేసింది. BaaS పథకం భారత దేశంలో విడుదలైన మొదటి కారు ఇది. ఇప్పుడు కామెట్ EV, MG ZS EVలకు కూడా BaaS పథకంలోకి తీసుకువచ్చింది. దీని వల్లనే ఈ రెండు కార్ల ధరలు తగ్గాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
mg zs ev రేంజ్

mg zs ev రేంజ్

BaaS పథకం అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ప్రోగ్రామ్‌. అంటే రెంట్(అద్దె) ఇచ్చి బ్యాటరీని తీసుకోవచ్చు. దీని వల్ల కార్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కస్టమర్ల కోసం BaaS పథకాన్ని ప్రారంభించింది. 

35
mg మోటార్స్

mg మోటార్స్

బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ పథకంలో కంపెనీ బ్యాటరీ అద్దెకు అందుబాటులో ఉంటుంది. మీరు కిలోమీటరుకు ధర చెల్లిస్తే బ్యాటరీ తీసుకెళ్లవచ్చు. కామెట్ EV, ZS EV కోసం ప్రారంభించిన బ్యాటరీ అద్దె పథకంలో ఈ వాహనాల ధరలు భారీగా తగ్గాయి. MG మోటార్స్ కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కస్టమర్లు బ్యాటరీ మొత్తం ధరను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. కారు కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్లు కిలోమీటరుకు ఎంత ఖర్చు అవుతుందో, వారు ఎన్ని కిలో మీటర్లు తిరగాలి అనుకుంటున్నారో నిర్ణయించుకొని అంత వరకే డబ్బులు చెల్లిస్తే బ్యాటరీ రీఛార్జ్ చేసి ఇస్తారు. 

 

45
mg కార్లు

mg కార్లు

MG కామెట్ EV ప్రారంభ ధర రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు ఈ కారును బ్యాటరీ అద్దె ఎంపికతో కొనుగోలు చేస్తే ఈ ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.4.99 లక్షల ప్రారంభ ధరకు (షోరూమ్) కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులకు రూ.2 లక్షల మేర ప్రయోజనం చేకూరుతుంది. కారు కొనుగోలు చేసిన తర్వాత బ్యాటరీ అద్దెకు కిలోమీటరుకు రూ.2.5 చెల్లించాలి. మీరు ఎన్ని కిలో మీటర్లు తిరగాలనుకుంటున్నారో చెబితే సర్వీస్ సెంటర్ లో అంత రీఛార్జ్ చేసి బ్యాటరీ ఫిట్ చేసి ఇస్తారు. MG కామెట్ EV రేంజ్ విషయానికొస్తే ఈ కారు ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 

55
భారతదేశంలో mg ఎలక్ట్రిక్ కార్లు

భారతదేశంలో mg ఎలక్ట్రిక్ కార్లు

MG బ్రాండ్ ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.18.98 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. అయితే బ్యాటరీ అద్దె పథకంతో ఈ కారును కొనుగోలు చేస్తే ఈ కారును మీరు రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంటే వినియోగదారులకు సుమారు రూ.5 లక్షలు సేవ్ అవుతాయి. అయితే బ్యాటరీ అద్దె పథకం కింద ఈ కారుకు కిలోమీటరుకు రూ.4.5 చెల్లించాలి. MG ZS EV రేంజ్ విషయానికొస్తే ఈ కారు పూర్తి ఛార్జ్‌పై 461 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved