34 కి.మీ. మైలేజ్ ఇచ్చే కొత్త మారుతి సెలెరియో కారు ధర ఇంత తక్కువ
ఫ్యామిలీ కారుగా పేరు సంపాదించిన మారుతి సుజుకి సెలెరియో కొత్త స్పెషల్ ఎడిషన్ కారును లాంచ్ చేసింది. ఏకంగా 34 కి.మీ మైలేజ్ ఇచ్చే ఈ కారు ధర తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంత మైలేజ్ ఇచ్చే కారు ఇంత తక్కువకు లభిస్తోందా అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనే ప్లాన్ ఉంటే మారుతి సుజుకి సెలెరియో స్పెషల్ ఎడిషన్ గురించి ఇక్కడ మరిన్ని వివరాలు ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.

మారుతి సుజుకి తన ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో దీని ధర కేవలం రూ.4.99 లక్షలు. కొత్త ఫీచర్స్, యాక్సెసరీస్ తో పండుగ సీజన్‌కు తగ్గట్టుగా ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చింది.
సెలెరియో స్పెషల్ ఎడిషన్‌లో కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌టీరియర్ బాడీ కిట్, క్రోమ్ ఇన్సర్ట్స్ ఉన్న సైడ్ మోల్డింగ్, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ టోన్ డోర్ సిల్ గార్డ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఫ్యాన్సీ ఫ్లోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కారు లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
సెలెరియో స్పెషల్ ఎడిషన్‌లో ఇంజిన్ విషయానికొస్తే పాత దాన్నే వాడారు. 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇందులో ఉంది. 66 bhp పవర్, 89 Nm టార్క్ ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ ఉంది. CNG వేరియంట్ లో కూడా ఈ కారు లభిస్తుంది. ఇది 56 bhp, 82.1 Nm టార్క్ ఇస్తుంది.
సెలెరియో స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ అయితే 25.24 kmpl మైలేజ్ ఇస్తుంది. AMT మోడ్ లో 26.68 kmpl మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ అయితే ఏకంగా 34.43 km/kg మైలేజ్ ఇస్తుంది. ఇంత మంచి ఫీచర్లు ఉన్న కారు కేవలం రూ.5 లక్షల లోపు లభిస్తుండటం గ్రేట్. ఇవే కాకుండా 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ & హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.
మారుతి సెలెరియో స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌షోరూం ధర రూ.4.99 లక్షలు. ఇది బేస్ వేరియంట్ ధర మాత్రమే. టాప్ వేరియంట్‌కి వస్తే ధర కొంచెం ఎక్కువ ఉండవచ్చు. రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీస్ ను కంపెనీ అందజేస్తోంది. మీరు గాని తక్కువ బడ్జెట్ లో కారు కొనే ప్లాన్ లో ఉంటే మారుతి సెలెరియో స్పెషల్ ఎడిషన్ మంచి ఎంపిక అవుతుంది.