Maruti Invicto: మారుతి ఇన్విక్టోకి పోటీగా ఉన్న 5, 7 సీటర్ సూపర్ కార్లు ఇవే..
Maruti Invicto: మారుతి ఇన్విక్టో.. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న కారు. దీని మోడల్, ఫీచర్స్ జనానికి బాగా నచ్చుతున్నాయి. అయితే మీకు ఈ కారుకు ప్రత్యామ్నాయంగా ఉన్న మరి కొన్ని కార్ల గురించి వివరాలు కావాలా? ఇక్కడ ఉన్నాయి. ఓసారి పరిశీలించండి.

మారుతి అమ్మే ఫ్లాగ్‌షిప్ వాహనాల్లో ఇన్విక్టో మోడల్ ఒకటి. ఇది 23.24 కి.మీ/లీ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. 7 సీట్లున్న ఈ కారు పెద్ద ఫ్యామిలీస్ ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
మారుతి సుజుకి ఇన్విక్టో ధర రూ. 25.51 లక్షల నుండి రూ. 29.22 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఇది 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో పని చేస్తుంది. మారుతి నుండి జీటా+, ఆల్ఫా+ అనే రెండు ఇన్విక్టో మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఇన్విక్టో లాంటి లేదా దానికంటే బెస్ట్ ఫీచర్స్ ఉన్న కారు కోసం చూస్తుంటే ఇక్కడ కొన్ని ఆల్టర్నేటివ్ మోడల్స్ ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించండి.
1. టయోటా ఇన్నోవా హైక్రాస్
టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 19.94 లక్షల నుండి రూ. 31.34 లక్షల వరకు ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్‌లతో ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అందువల్ల వీటి ఇంధన సామర్థ్యాల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. వీటి ఇంధన సామర్థ్యం 16.13 కి.మీ/లీ, 23.24 కి.మీ/లీ.గా ఉంది.
2. ఎంజి హెక్టర్ ప్లస్
హెక్టర్ ప్లస్ 7 సీటర్ మోడల్. దీని ధర రూ. 17.50 లక్షల నుండి రూ. 23.67 లక్షల వరకు ఉంటుంది. హెక్టర్ ప్లస్ డీజిల్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. దీనికి రెండు ఇంజిన్‌లు, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తుంది. ఈ కారు ఏడు రంగుల్లో, ఐదు వేరియంట్లలో లభిస్తుంది.
3. మహీంద్రా XUV 700
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో టాప్ లో ఉండే కంపెనీ మహీంద్రా. అందులోనూ XUV700 ఎక్కువగా అమ్ముడయ్యే కార్లలో ముందుంటుంది. ఇది 5-సీటర్, 7-సీటర్ వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు రూ. 13.99 లక్షల నుండి రూ. 24.99 లక్షల వరకు ఉంటాయి. మహీంద్రా పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లను ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందిస్తుంది.
4. టాటా సఫారీ
సఫారీ 7-సీటర్ ఫెసిలిటీతో లభిస్తుంది. సఫారీ ధర రూ. 15.50 లక్షల నుండి రూ. 27 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ప్రస్తుతం సఫారీకి 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇది హెక్టర్‌తో కూడా ఉంటుంది. ఇది 168 హార్స్‌పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మీరు ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లను ఎంచుకోవచ్చు.
5. హ్యుండై అల్కాజర్
హ్యుండై అల్కాజర్ అనేది క్రెటా ఆధారిత త్రీ-రో SUV. దీని ధర రూ. 14.99 లక్షల నుండి రూ. 21.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో లభిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల లాంగ్ డ్రైవ్స్ కి చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న మరో గొప్ప ఫీచర్ ఏంటంటే డీజిల్ ఇంజిన్‌కు టార్క్ కన్వర్టర్, పెట్రోల్ ఇంజిన్‌కు DCT యూనిట్‌ను ఎంచుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ అనే నాలుగు వేరియంట్లలో ఈ కారు లభిస్తుంది. 6-సీటర్, 7-సీటర్ లేఅవుట్‌లలో అందుబాటులో ఉంది.