2024లో కియా కార్ల విక్రయాల జోరు.. టాటా, మహీంద్రాకు పోటీ?
కార్ల తయారీ సంస్థ కియా.. ఇప్పుడు దేశంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. 2019లో ఒకే ఒక్క మోడల్‌తో దేశంలోకి అడుగుపెట్టిన కియా.. ఇప్పుడు సెల్టోస్, సోనెట్, కారెన్స్, కార్నివాల్, EV6 లాంటి వాహనాలతో మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది.

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ 2019లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. వాహన విభాగంలో ఇప్పుడు బలమైన సంస్థగా ఉంది. 2024లో, కియా ఇండియా 2,45,000 కార్లను విక్రయించింది. ఇది కంపెనీ మొత్తం అమ్మకాలలో 7.93%.
విక్రయాలు జోరుగా..
2024లో కంపెనీ మొత్తం అమ్మకాలలో 46.5% మార్కెట్ వాటాను కియా సెల్టోస్ మాత్రమే సాధించింది. 2019 ఆగస్టు నుంచి, 5.20 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. 2024లో లక్షకు పైగా సోనెట్ SUVలు అమ్ముడయ్యాయి. దీంతో పాటు, కారెన్స్ అమ్మకాలు 2 లక్షలకు చేరుకున్నాయి.
ఉత్తమ మైలేజ్ కార్
2024 కియా ఇండియా సేల్స్ రిపోర్ట్ ప్రకారం, సోనెట్ 1,06,690 కార్లను అమ్మి 11వ స్థానంలో ఉంది. 73,745 కార్ల అమ్మకాలతో సెల్టోస్ 17వ స్థానంలో.. 63,674 కార్ల అమ్మకాలతో 7 సీటర్ కారెన్స్ 18వ స్థానంలో ఉన్నాయి. 2024 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో కియా ఇండియా 1,79,631 యుటిలిటీ వాహనాలను అమ్మింది. దాని మార్కెట్ వాటా 8.76%.
అత్యధికంగా అమ్ముడైన కియా కార్లు
తక్కువ వ్యవధిలోనే భారతీయ మార్కెట్లో కియా ఇండియా బలమైన స్థానాన్ని సంపాదించిందని ఈ గణాంకాలు చూపిస్తున్నాయి. సెల్టోస్, సోనెట్ లాంటి ఉత్పత్తులు కంపెనీని విజయం వైపు నడిపించాయి. కియా 2024లో 30.89 లక్షల కార్లను విక్రయించింది.
ఫిబ్రవరి 1న కొత్త సెల్టోస్..
ఈ ఫిబ్రవరి 1న కొత్త సెల్టోస్ విడుదల కానుంది. దీంతో కంపెనీ అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. సెల్టోస్ రాకతో కియా ఇండియా మార్కెట్ వాటా మరింత పెరిగే అవకాశం ఉంటుంది.