లేట్ చేస్తే జియోలో సూపర్ డేటా ప్లాన్ ఆఫర్ మిస్ అవుతారు
జియో అద్భుతమైన 200 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న లాంగ్ టర్మ్ ప్యాకేజీ త్వరలోనే ముగుస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏకంగా 500 GB డేటా పొందవచ్చు. మంచి ఆఫర్ మిస్ చేసుకోకూడదంటే వెంటనే రీఛార్జ్ చేసుకోండి. ఈ ఆఫర్ డీటైల్స్ ఇక్కడ ఉన్నాయి.

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇటీవల నూతన సంవత్సర ఆఫర్‌లో భాగంగా కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ.2025. దీనిలో 200 రోజుల వ్యాలిడిటీతో 500 GB డేటా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ త్వరలో ముగియనుంది. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పరిమిత కాలం కోసం మాత్రమే అందుబాటులో ఉంది.
జియో రీఛార్జ్ ప్లాన్ 2025, ఆఫర్ ఎప్పుడు?
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా రిలయన్స్ జియో నూతన సంవత్సర వెల్కమ్ ఆఫర్ 2025ని ప్రవేశపెట్టింది. కానీ ఈ ఆఫర్ జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆఫర్. ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు ఇవిగో.
రూ.2025 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో ప్రీపెయిడ్ కస్టమర్లకు 200 రోజుల పాటు అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్, అన్ లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే 4G కనెక్షన్ ఉన్నవారికి రోజుకు 2.5 GB డేటా లభిస్తుంది. అంటే మొత్తం వ్యాలిడిటీ కాలానికి 500 GB అన్నమాట. మొత్తం వ్యాలిడిటీ కాలానికి రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి.
రూ.2,150 వరకు వోచర్లు, కూపన్లు
డేటా, వాయిస్ ప్రయోజనాలతో పాటు జియో నూతన సంవత్సర వెల్కమ్ ఆఫర్‌లో వివిధ కూపన్లు కూడా లభిస్తాయి. కస్టమర్లు రూ.500 జియో కూపన్ పొందవచ్చు. దీన్ని షాపింగ్ లో కనీస రూ.2,500 విలువైన వస్తువులు కొన్నప్పుడు ఉపయోగించవచ్చు. అదే సమయంలో రూ.499 లేదా అంతకంటే ఎక్కువ స్విగ్గీ ఆర్డర్‌లకు రూ.150 విలువైన వోచర్ ఉపయోగించొచ్చు. అలాగే Easemytrip.com మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ఫ్లైట్ బుకింగ్‌లపై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కూపన్లు ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ అందుబాటులో ఉన్న MyJio యాప్ నుండి పొందవచ్చు.