- Home
- Business
- ITR filing చివరి తేదీ: గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిన దాఖలు.. చివరి తేదీ గురించి తెలుసుకోండి
ITR filing చివరి తేదీ: గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిన దాఖలు.. చివరి తేదీ గురించి తెలుసుకోండి
ఆదాయపు పన్ను రిటర్న్(income tax return) దాఖలు చేయడానికి చివరి తేదీ చాలా దగ్గరలో ఉంది. ఐటిఆర్ ని 31 డిసెంబర్ 2021 లోగా ఫైల్ చేయవచ్చు. అయితే గణాంకాలను పరిశీలిస్తే గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటివరకు రిటర్నుల దాఖలు వేగం చాలా తక్కువగా ఉంది.

2019-20 ఆర్థిక సంవత్సరం(financial year)లో డిసెంబర్ 26 వరకు 5.95 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులను దాఖలు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 4.31 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఐటీఆర్ దాఖలు చేశారు.
మూడు రోజుల గడువు ముగిసే సమయానికి
ఐటి డిపార్ట్‌మెంట్ ITR 3 దాఖలు చేయడానికి గతంలో రెండుసార్లు గడువును పెంచింది. అంటే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు ఇప్పుడు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. పన్ను చెల్లింపుదారులు(tax payers) రిటర్నులను గడువు తేదీలోగా దాఖలు చేయాలని, లేకుంటే వారు ఇబ్బందుల్లో పడవచ్చని మెసేజులు ఇంకా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డిపార్ట్‌మెంట్ ద్వారా సమాచారం అందిస్తోంది. ఇదిలావుండగా గత ఏడాదితో పోలిస్తే ఐటీఆర్ దాఖలు చేసే వారి సంఖ్య తక్కువగానే ఉంది. అయితే మొత్తం సంఖ్యను పరిశీలిస్తే, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 1.5 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులను దాఖలు చేశారు. అయితే, మిగిలిన రోజుల్లో రిటర్న్ ఫైలింగ్‌లో వేగం కూడా పుంజుకునే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఈ ఏడాది డిసెంబర్ 26 వరకు దాఖలైన మొత్తం ఆదాయపు పన్ను రిటర్నుల్లో 2.44 కోట్ల రిటర్నులు ఐటీఆర్-1 ఫారమ్ (sahaj), 1.12 కోట్ల రిటర్నులు ఐటీఆర్-4 ఫారమ్ (sugam)గా ఉన్నాయి. సహజ్ ఇంకా సుగమ్ ఫారమ్‌లు చిన్న అలాగే మధ్యస్థ పన్ను చెల్లింపుదారుల రాబడి కోసం ఉపయోగించబడతాయి. రూ.50 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు సహజ్ ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. జీతం, హౌస్ ప్రాపర్టీని ఆర్జించే పన్ను చెల్లింపుదారులు సహజ్ ఫారమ్‌ను పూరించాలి. మరోవైపు, సుగమ్ ఫారమ్ ద్వారా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు హిందూ అవిభాజ్య కుటుంబాలు ఇంకా వ్యాపార ఆదాయం రూ. 50 లక్షల వరకు ఉన్నవారు ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించవచ్చు. విశేషమేమిటంటే, వీరిలో కేవలం ఒక్కరోజులోనే 8.7 లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయగా, గత వారంలో 46.77 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. డిసెంబర్ 25వ తేదీనే 11.68 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారు.
చివరి తేదీని పొడిగించవచ్చు
ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో చివరి తేదీని మరోసారి పొడిగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది, ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని మొదట జూలై 31 నుండి నవంబర్ 30 వరకు పొడిగించి, ఆపై డిసెంబర్ 31 వరకు పొడిగించారు. కానీ, ఇప్పటికీ చాలా మంది ఐటీఆర్ దాఖలు చేయలేదని ప్రభుత్వం భావించినప్పటికి ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీని జనవరి 10 వరకు పొడిగించవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈసారి కూడా కనీసం జనవరి 10 వరకు పొడిగించవచ్చని కొందరు భావిస్తున్నారు.
अब इनकम टैक्स रिटर्न (ITR) फाइल करने की प्रक्रिया को सुविधाजनक और आसान बनाने के लिए प्री-फिल्ड आईटीआर फॉर्म उपलब्ध कराया जाएगा। इससे लोगों को आईटीआर फाइल करने में ज्यादा दिक्कत नहीं होगी, वहीं इनकम टैक्स डिपार्टमेंट के कर्मचारियों को भी सहूलियत होगी। (फाइल फोटो)
సులభంగా ఐటిఆర్ ఫైల్ చేయడం ఎలా
-ముందుగా (https://eportal.incometax.gov.in/)కి లాగిన్ అవ్వండి .
-మీ యూజర్ ఐడిని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
-పాస్‌వర్డ్ గుర్తు లేకుంటే, ఫర్గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించవచ్చు.
-ఓపెన్ ఐనా లాగిన్ పేజీలో ఇ-ఫైల్‌పై క్లిక్ చేయండి (click on e-file).
-దీని తర్వాత, మీరు ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఆప్షన్ ఎంచుకోవాలి.
-ఇప్పుడు 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంచుకుని, ఆపై కంటిన్యూ చేయండి
-దీని తర్వాత మీరు ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ అప్ప్శన్ పొందుతారు.
మీరు ఆన్‌లైన్‌ని ఎంచుకుని, వ్యక్తిగత ఎంపికను ఎంచుకోండి.
-ఆపై ఐటిఆర్-1 (ITR-1) లేదా ఐటిఆర్-4 ఆప్షన్ ఎంచుకోండి.
-మీరు జీతం పొందుతున్నట్లయితే, మీరు ITR-1 ఆప్షన్ ఎంచుకోవాలి.
-దీని తర్వాత ITR రిటర్న్ ఫారమ్ మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేయబడుతుంది.
-అప్పుడు ఫిల్లింగ్ టైప్‌లో 139(1)- ఒరిజినల్ రిటర్న్‌ని ఎంచుకోండి. ఇది ఎంచుకున్న ఫారమ్‌ను ఓపెన్ చేస్తుంది
-అందులో అభ్యర్థించిన సమాచారాన్ని నింపడం ద్వారా సేవ్ చేసుకోండి. బ్యాంకు ఖాతా వివరాలను సరిగ్గా నింపండి
-ఆన్‌లైన్ ప్రక్రియలో వేరిఫై చేసి అలాగే రిటర్న్ హార్డ్ కాపీని ఆదాయపు పన్ను శాఖకు పంపండి.