- Home
- Business
- IPL: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ క్రికెట్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే
IPL: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ క్రికెట్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే
IPL: క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఇకపై మీరు ఐపీఎల్ క్రికెట్ ను ఉచితంగా వీక్షించలేరు. దీనికోసం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్- డిస్నీ జాయింట్ వెంచర్(JV)లో దేశవ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ ప్రసారమవుతుంది. అయితే దీనికి సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఉండేలా JV ఆలోచనలు చేస్తోందని తెలుస్తోంది. ఐపీఎల్ స్ట్రీమింగ్ సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను ఉచితంగా చూడాలని ఆశ పడుతున్న క్రికెట్ అభిమానులు ఇకపై తమ జేబులను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలయన్స్- డిస్నీ జాయింట్ వెంచర్(JV) ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్లను ఉచితంగా స్లీమింగ్ చేయడాన్ని నిలిపివేయనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం రిలయన్స్-డిస్నీ కలిసి ఒక కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ ని తీసుకొచ్చేందుకు ఆలోచిస్తున్నాయట.
ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ ఎలా ఉండనుంది అంటే.. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను ముందు కొంతసేపు ఉచితంగా వీక్షించవచ్చు. పరిమిత డేటా అయిపోయిన తర్వాత క్రికెట్ మ్యాచ్ చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇందుకోసమే రిలయన్స్-డిస్నీ కలిసి కొత్త స్ట్రీమింగ్ యాప్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాయి. ఈ యాప్ ప్రారంభ సబ్స్రిప్షన్ ధర 149 రూపాయల నుంచి ఉంటుంది. అంటే నెలకు 149 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడు నెలలకు అయితే 499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ప్లాన్ వేసుకుంటే కలిగే గొప్ప ప్రయోజనం ఏంటంటే.. మీరు క్రికెట్ మ్యాచ్లను యాడ్స్ లేకుండా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సౌకర్యం కోసమైనా క్రికెట్ అభిమానులు సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారని కంపెనీ భావిస్తోంది.
రిలయన్స్- డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశంలో 100కు పైగా టీవీ చానల్స్, అనేక స్క్రీనింగ్ యాప్లను నిర్వహిస్తోంది. అందువల్ల ఇకపై ఐపీఎల్ క్రికెట్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని రాయటర్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.