iPhone 14: ఐఫోన్ 14 ధర ఇంత తక్కువా? ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూసే..
iPhone 14: ఐఫోన్ ప్రేమికులకు గుడ్ న్యూస్. మీరు ఊహించనంత తక్కువ ధరకు ఐఫోన్ 14 సిరీస్ మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీని ధర, ఎక్కడ కొనాలి తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

మార్కెట్లో ఎన్ని కంపెనీల సెల్ ఫోన్స్ ఉన్నా.. ఐఫోన్ కి ఉన్న క్రేజే వేరు. ఆపిల్ కంపెనీ కొత్త ఐఫోన్ సిరీస్ ని రిలీజ్ చేసిందంటే చాలు వాటిని కొనడానికి క్యూ కడతారు. యూత్ అయితే ధర ఎక్కువగా ఉన్నా అప్పు చేసి మరీ కొంటుంటారు. ఒక్కసారి ఐఫోన్ వాడిన వాళ్ళు మరే ఇతర ఫోన్లు వాడలేరు. ఐఫోన్ లో ఫీచర్లు అలా ఉంటాయి మరి.
సెక్యూరిటీ పరంగా కూడా మిగిలిన ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ చాలా ప్రైవసీని ఇస్తుంది. అందుకే ఐఫోన్ లో కొత్త సిరీస్ వచ్చినా అంత ఎక్కువ ధర పెట్టి కొనలేని వారు పాత సిరీస్ ఫోన్లు కొంటుంటారు. అందుకే మార్కెట్లో ఐఫోన్లకు క్రేజ్ ఏమాత్రం తగ్గదు.
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు సందడి చేస్తున్నాయి. వీటి ధరలు ఐఫోన్ 14తో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ప్రస్తుత మార్కెట్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ తదితర మోడల్స్ భారీ ధరకు అమ్ముడవుతున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ధర రూ.70 వేల నుంచి ప్రారంభమవుతుంది.
ఇంత ధర పెట్టి ఐఫోన్ కొనలేని వారికి రిలయన్స్ డిజిటల్ బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ కేవలం రూ.52,400 లకు లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో ఐఫోన్ 14 ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 14 అధికారిక ధర రూ.59,900 గా యాపిల్ కంపెనీ నిర్ణయించింది. అయితే రిలయన్స్ డిజిటల్ లో ఈ ఫోన్ కేవలం రూ.52,400 లభిస్తోంది. అంటే రూ.7500 డిస్కౌంట్ మీరు పొందవచ్చు.
మీ దగ్గర హెచ్ఎస్బీసీ, ఐడీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు ఉంటే మరికొన్ని అదనపు ఆఫర్లు లభిస్తాయి. వీటి ద్వారా ఐఫోన్ 14 ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
2022 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 14 ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇది 6.1 అంగుళాల కాంపాక్ట్ స్క్రీన్ ను కలిగి ఉంది. A-15 బయోనిక్ చిప్ ఉండటం వల్ల ఈ ఫోన్ పనితీరు సూపర్ గా ఉంటుంది. ఇది మంచి బ్యాటరీ లైఫ్ ని కూడా ఇస్తుంది.