స్విగ్గీ, జోమాటోలకు షాక్: ఇన్ఫోసిస్ నారాయణమూర్తితో కలిసి అమెజాన్ ఎంట్రీ

First Published 30, Jul 2019, 2:28 PM

అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. 

అమెజాన్- ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని ఆన్ లైన్ వినియోగదారుడు లేడంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా అత్యధిక డిస్కౌంట్లను ఇస్తూ అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే ఆన్ లైన్ పోర్టల్ గా ప్రాజాదరణ చూరగొంది. ఇప్పుడు ఈ ఆన్ లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ఒకవైపు ఉబర్ ఈట్స్ ను అమెజాన్ కొనుగోలు చేయబోతుంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ అందులో నిజం ఎంతుందో మాత్రం తెలీదు. అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ఎంటర్ అవనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఉద్యోగులను నియమించుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే మార్కెట్లో ఇప్పటికే టాప్ ప్లేయర్లుగా ఉన్న స్విగ్గీ, జొమాటోలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఇప్పటికే ఒకరితో ఒకరు పోటీపడుతూ కోట్ల రూపాయలను మార్కెట్లో డిస్కౌంట్ల రూపంలో, యాడ్స్ రూపంలో కుమ్మరించారు. ఓలా కంపెనీ మరో ఫుడ్ డెలివరీ కంపెనీ ఫుడ్ పాండా ను కొనుగోలు చేయడంతో, మార్కెట్లో ఇక లేదు అనుకున్న ఫుడ్ పాండా కొత్త ఊపిరి పోసుకుంది. ఇప్పటికే మార్కెట్లో  అనేక కంపెనీలతో చాల పోటీ నెలకొని ఉన్న తరుణంలో, ఇలా అమెజాన్ ఎంట్రీ ఇవ్వనుందన్న వార్తలతో ఆల్రెడీ ఉన్న కంపెనీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి.

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి చెందిన మరో కంపెనీతో కలిసి భారత్ లో తమ ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించాలని అమెజాన్ భావిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ దసరా దీపావళి పండుగ సీజన్ ప్రారంభానికి ముందే స్టార్ట్ చేయాలనే ఆలోచనలో కంపెనీ ఉంది.

దీనివల్ల కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం మాత్రమే కాకుండా, కొత్త కస్టమర్లను ఆమెజాన్ వైపు ఆకర్షితులను కూడా చేసి తమ కస్టమర్ బేస్ ను పెంచుకోవాలని కంపెనీ భావిస్తుంది. ఇందుకోసం త్వరలోనే తమ యాప్ లోనే దీన్ని కూడా చేర్చి అన్నీటికీ ఒకటే యాప్ ని వినియోగదారులకు అందించనుంది. ఇలా చేయడం ద్వారా వినియోగదారులకు సేవలను సులభతరం చేయవచ్చని అమెజాన్ ఆలోచిస్తుంది.

ఇప్పటికే అత్యధిక డిస్కౌంట్లను అందిస్తుంది అని పేరున్న అమెజాన్ ఇదే స్ట్రాటజీని కొనసాగించి సక్సెస్ అవ్వాలని భావిస్తుంది. ఏది ఏమైనా, ఇప్పటికే నెలకొని ఉన్న కాంపిటీషన్ వల్ల ఇబ్బడి ముబ్బడిగా డిస్కౌంట్లు ఆఫర్లు ఇస్తున్న ఫుడ్ డెలివరీ కంపెనీలు మరిన్ని డిస్కౌంట్లను మాత్రం కస్టమర్లకు అందించక తప్పదు

రాబోయే మరి కొన్ని నెలలపాటు వినియోగదారులు అతి తక్కువ ధరలకే తమకు నచ్చిన రెస్టారెంట్ల నుండి తమకు తినాలనిపించిన ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకెందుకు వెయిటింగ్ ??? ఎంజాయ్ ఆర్దరింగ్...

loader