- Home
- Business
- NFT collection: NFT టోకెన్ అంటే ఏంటి.. NFT ఎసెట్స్ ఉన్న టాలివుడ్, బాలివుడ్ సెలబ్రిటీలు వీళ్లే...
NFT collection: NFT టోకెన్ అంటే ఏంటి.. NFT ఎసెట్స్ ఉన్న టాలివుడ్, బాలివుడ్ సెలబ్రిటీలు వీళ్లే...
సెలబ్రిటీలు తమ అభిమానులతో అనేక మార్గాల్లో కనెక్ట్ అవుతున్నారు. అందులో నాన్ ఫంగిబుల్ టోకెన్‌లు లేదా NFTలు భవిష్యత్తులో ఒక ప్రధాన మార్గంగా మారనున్నాయి. అనేక మంది ప్రముఖ గాయకులతో సహా పలువురు భారతీయ ప్రముఖులు వారి వ్యక్తిగత NFT లను ప్రారంభించారు. ఏ ఏ సెలబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారో తెలుసుకుందాం.

NFT అనేది ఒక డిజిటల్ అసెట్. ఇందులో అపూర్వమైన కళాఖండాలు, చిత్రాలు, సంగీతం, వీడియోలు, సహా ప్రతీ ఒక్కటి ఇందులో ఒక డిజిటల్ అసెట్ గా మార్చుకొని వాటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టవచ్చు. క్రిప్టో కరెన్సీ ద్వారా మాత్రమే వీటిని కొనుగోలు చేయడం సాధ్యం అవుతుంది. క్రిప్టో సాఫ్ట్‌వేర్లతోనే వీటిని ఎన్‌కోడ్ చేసి డిజిటల్ ఎసెట్ గా భద్రపరుస్తారు. 2014 నుంచి ఎన్‌ఎఫ్‌టీలు ఉన్నప్పటికీ 2021లోనే ఎక్కువ ప్రాచుర్యం లభించింది. 2017 నుంచి ఇప్పటి వరకు 200 మిలియన్ డాలర్ల విలువైన ఎన్‌ఎఫ్‌టీలు అమ్ముడయ్యాయి.
సోనూ నిగమ్
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు నటుడు అయిన సోను నిగమ్. ఇతను హిందీ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన నేపథ్య గాయకులలో ఒకరు. కళా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను, భారత ప్రభుత్వం అతనికి దేశంలోని నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. అయితే సోను నిగం ఇటీవల NFT బ్యాండ్‌వాగన్‌లో చేరాడు. డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ బిజినెస్ అయిన జెట్‌సింథెసిస్‌తో కలిసి లండన్‌లో భారతీయ సంగీత పరిశ్రమ మొట్టమొదటి NFT సిరీస్‌ను సోనూ నిగమ్ ప్రారంభించారు. "హాల్ ఆఫ్ ఫేమ్," అతని మొదటి అధికారిక ఆంగ్ల పాటను ఈ సిరీస్‌లో చేర్చారు.
కుమార్ సాను
కుమార్ సాను ఉత్తమ నేపథ్య గాయకుడిగా (1990-1994) వరుసగా ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్న రికార్డు ఈయన పేరుమీద ఉంది. 2009లో భారతీయ సినిమా, సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. ఆయన పాటలు చాలా వరకు BBC "టాప్ 40 బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్ ఆఫ్ ఆల్ టైమ్" జాబితాలో ఉన్నాయి. అయితే కుమార్ సాను తన విడుదల చేయని పాటల ప్రత్యేక వీడియోలు, ఆడియోలు, తన మొదటి ఆడిషన్ క్లిప్‌లు, ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ జ్ఞాపకాలు, సేకరణలు, అతని అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని హిట్‌ల తెరవెనుక సంగతులను జోడిస్తూ NFT సిరీస్‌ను ప్రారంభించాడు, FlamingoNFT ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
SPB బాలుగా ప్రసిద్ధి చెందిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ నేపథ్య గాయకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, సంగీత దర్శకుడు, నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. అతను భారతదేశం యొక్క ఆల్-టైమ్ గ్రేట్ సింగర్‌లలో ఒకరిగా చాలా మందిచే పరిగణించబడ్డారు.. దివంగత SPB చివరి విడుదల అవని పాట డిజినూర్ ద్వారా NFTగా విడుదల చేశారు.
ఇళయరాజా
ఇళయరాజా గొప్ప భారతీయ సంగీత స్వరకర్తలలో ఒకరిగా పరిగణిస్తారు. దక్షిణ భారత చలనచిత్ర సంగీతంలో ఆయన లెజెండ్ గా ఘనత పొందాడు. 79 ఏళ్లు పూర్తి చేసుున్న ఇళయరాజా NFTని ఆయన పుట్టిన రోజున విడుదలైంది. NFT మార్కెట్‌ప్లేస్ WishWorld.comలో సంగీతకారుడి NFT సేకరణను విక్రయించనున్నట్లు గౌతమ్ R ట్విట్టర్‌లో వెల్లడించారు.
కమల్ హసన్
కమల్ హాసన్ సైతం తన పుట్టినరోజున, కమల్ హాసన్ వెబ్ 3 రంగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించారు. కమల్ హాసన్ తన NFT కలెక్షన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయన మెటావర్స్‌లో తన స్వంత డిజిటల్ అవతార్‌ను కలిగి ఉన్న మొదటి భారతీయ సెలబ్రిటీ అయ్యాడు.