Indian Navy: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, నేవీలో 250 ఉద్యోగాలకు నోటిఫికేషన్
Indian Navy: ఇండియన్ నేవీలో జాబ్ సంపాదించాలన్న నిరుద్యోగుల కల నెరవేరనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎప్పటి లోపు దరఖాస్తు చేసుకోవాలి? ఇలాంటి వివరాలు తెలుసుకుందాం రండి.

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (SSC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించిన సమాచారం ప్రకారం జనవరి 2026 బ్యాచ్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పోర్టల్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ నేవీ విడుదల చేసిన సమాచారం ప్రకారం మొత్తం 250 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో 60 పైలట్లు, 26 నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ అబ్జర్వర్లను రిక్రూట్ చేస్తారు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పోస్టుల్లో 18 ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ లో ఉంది.
ఇవి కాకుండా ఇంజినీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ GS పోస్టుల్లో 38, ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్‌లో 45 పోస్టులకు నియామకాలు చేపడతారు. నావల్ ఆర్కిటెక్ట్ పోస్టుల్లో 18 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు సమర్పించాలి. అప్లికేషన్స్ కూడా ఆన్‌లైన్ లోనే స్వీకరిస్తారు.
వయసు, విద్యార్హతలు
నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్(అబ్జర్వర్లు) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో BE/BTech ఉత్తీర్ణులై ఉండాలి. 10, 12వ తరగతుల్లో మొత్తం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీషులో కనీసం 60% మార్కులతో పాసై ఉండాలి. అభ్యర్థులు జనవరి 02, 2002 నుండి జనవరి 01, 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా?
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా www.joinindiannavy.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోమ్ పేజీలో న్యూస్ సెక్షన్‌కి వెళ్లాలి.
ఇప్పుడు "Application Window for Live SSC Entry January 2026 (ST 26) Course from 08 February to 25 February 2025" లింక్‌పై క్లిక్ చేయాలి.
ఇక్కడ రిజిస్టర్ చేసుకుని, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించాలి. తర్వాత ప్రింట్ తీసుకోవాలి.