MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Traffic Rules Updated: వామ్మో.. తాగి బండి నడిపితే రూ.5 వేలు ఫైనా? కొత్త రూల్స్ ఇంత కఠినంగా ఉన్నాయేంటి?

Traffic Rules Updated: వామ్మో.. తాగి బండి నడిపితే రూ.5 వేలు ఫైనా? కొత్త రూల్స్ ఇంత కఠినంగా ఉన్నాయేంటి?

Traffic Rules Updated: ట్రాఫిక్ రూల్స్ మారిపోయాయ్. ఇకపై రూల్స్ తప్పితే ఏకంగా మాక్సిమం రూ.5 వేల వరకు ఫైన్ విధిస్తారు. ట్రాఫిక్ లో ఏ తప్పు చేస్తే ఎలాంటి ఫైన్ విధిస్తారో క్లియర్ గా తెలుసుకుందామా?

 

Naga Surya Phani Kumar | Published : Mar 19 2025, 02:38 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఇప్పుడు పెద్ద ఫ్యాషన్. హెల్మెట్ పెట్టుకోరు. ఓవర్ స్పీడ్ లో వెళతారు. రెడ్ సిగ్నల్స్ క్రాస్ చేస్తారు. ఇలా చేసినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగితే మాత్రం ప్రభుత్వాలను, చట్టాలను, వ్యవస్థలను నిందిస్తారు. అందుకే ప్రమాదాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రాఫిక్ రూల్స్ ని మరింత కఠినం చేసింది. కఠినం అంటే జైల్లో పెట్టడం లాంటివి కాదు. జరిమానాలు భారీగా పెంచేసింది. ఏ రూల్ పాటించపోతే ఎంత ఫైన్ పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

25
Asianet Image

కొత్త రూల్స్ ఎంత కఠినమో తెలుసా?

ఇప్పటి వరకు మాక్సిమం ఫైన్ రూ.1000 ఉండేది. ఇప్పటి నుంచి మాక్సిమం ఫైన్ రూ.5000 చేసింది. అంటే పోలీసుల విచక్షణను బట్టి వారు రూ.5000 వరకు ఫైన్ వసూలు చేయొచ్చన్న మాట. 

కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే.. హెల్మెట్ లేకుండా బైక్ లేదా స్కూటర్ నడిపితే రూ.1,000 ఫైన్, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తారు.

టూ వీలర్ మీద ముగ్గురు వెళ్తే రూ.1,000 ఫైన్ వేస్తారు.

35
Asianet Image

మాక్సిమం ఫైన్ రూ.20,000

సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తే రూ.1,000 ఫైన్.

డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రూ.500 నుండి రూ.5,000 వరకు ఫైన్ వేస్తారు.

లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే రూ.500కు బదులుగా ఇకపై ఏకంగా రూ.5,000 ఫైన్ విధిస్తారు.

ఇన్సూరెన్స్ పేపర్స్ లేకపోతే రూ.2,000 ఫైన్, 3 నెలలు జైలు శిక్ష కూడా ఉంటుంది.

లారీల వంటి లోడ్ వెహికల్స్ లో ఇప్పటివరకు ఓవర్ లోడ్ వేస్తే మా రూ.2,000 ఫైన్ వేసేవారు. ఈ జరిమానాను రూ.20,000లకు పెంచారు. 

45
Asianet Image

తాగి డ్రైవ్ చేస్తే జరిమానా రూ.10,000

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఇప్పటి వరకు మాక్సిమం రూ.1,000 ఫైన్ వేసేవారు. దీన్ని రూ.10,000 లకు పెంచారు. అంతేకాకుండా 6 నెలలు జైలు శిక్ష విధిస్తారు. అదనంగా సామాజిక సేవ కూడా చేయాల్సి ఉంటుంది. 

తాగి డ్రైవ్ చేస్తే ఇంతకుముందు రూ.1000 నుంచి రూ.1500 ఫైన్ వేసేవారు. ఇప్పుడు రూ.10,000 వసూలు చేస్తారు. దీంతో పాటు 6 నెలలు జైలు శిక్ష కూడా ఉంటుంది. మళ్లీ అదే తప్పు చేస్తే రూ.15,000 ఫైన్, 2 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. 

55
Asianet Image

అంబులెన్స్ కి దారి ఇవ్వకపోతే రూ.10,000 ఫైన్

బైక్ మీద స్టంట్స్ చేసినా, డేంజర్ గా డ్రైవ్ చేసినా, లేదా రేసింగ్ చేసినా ఇప్పటి వరకు రూ.500 ఫైన్ వసూలు చేసి వదిలేసేవారు. ఇకపై ఏకంగా రూ.5,000 ఫైన్ విధిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే విధించే రూ.500లకు బదులు ఇప్పుడు రూ.5,000 ఫైన్ కట్టాలి.

అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ వెహికల్స్ కు దారి ఇవ్వకపోతే ఇంతకుముందు రూ.1,000 జరిమానా విధించేవారు. ఇప్పుడు రూ.10,000 వరకు ఫైన్ వేస్తారు.

18 ఏళ్ల లోపు వాళ్ళు డ్రైవ్ చేస్తే రూ.2,500 నుండి రూ.25,000 ఫైన్ పెంచారు. దీంతో పాటు 3 ఏళ్ళు జైలు శిక్ష, ఏడాది పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.
 

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
 
Recommended Stories
Top Stories