గూగుల్‌పే, ఫోన్‌పే లకు కూడా క్రెడిట్ కార్డ్‌లు లింక్ చేసి వాడుకోవచ్చు. ఎలాగో తెలుసా?
మార్కెట్ లో ఏం కొన్నా ఎక్కువ మంది UPI ద్వాారానే పేమెంట్స్ చేస్తున్నారు. కాని అకౌంట్స్ లో డబ్బులు లేకపోతే చాలా మంది క్రెడిట్ కార్డులు వాడతారు. ఇక్కడ UPIకి క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేసి ఉపయోగించాలో క్లియర్ గా తెలుసుకుందాం రండి.
ఇండియాలో UPI ద్వారా పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన డేటా ప్రకారం తెలుస్తోంది. డిసెంబర్ 2024లో 16.73 బిలియన్ లావాదేవీలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగాయంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గత నవంబర్‌లో జరిగిన 15.48 బిలియన్ లావాదేవీలతో పోలిస్తే 8% పెరుగుదల కనిపించింది. భవిష్యత్తులో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరింత ఎక్కువగా జరగనున్నాయి. ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ కార్డులను కూడా UPI కి లింక్ చేసి ఉపయోగించుకోవచ్చు.
UPI బాగా పాపులర్ అవుతుండటంతో క్రెడిట్ కార్డ్ వాడేవారు కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌ని వాడుతున్నారు. మీ క్రెడిట్ కార్డ్‌ని UPIకి ఎలా లింక్ చేయాలో, ఇబ్బంది లేని లావాదేవీల ప్రయోజనాలను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి.
క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేయండి:
UPI యాప్ ఓపెన్ చేయండి. అంటే మీరు Google Pay, PhonePe, Paytm, BHIM, వీటిల్లో ఏ యాప్ ఉపయోగిస్తే ఆ యాప్ ఓపెన్ చేయండి. UPI సెట్టింగ్ పై క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ సాధారణంగా "UPI" లేదా "Payments" సెక్షన్ లో ఉంటుంది.
పేరును లేదా క్రెడిట్ కార్డు ఎంపిక చేయండి.
అక్కడ "Add Credit Card" లేదా "Link Credit Card" అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
క్రెడిట్ కార్డ్ వివరాలు నమోదు చేయండి. మీ క్రెడిట్ కార్డు నంబర్, పేరు, వాలిడిటీ, CVV కోడ్ వంటి వివరాలు ఎంటర్ చేయండి.
మీరు క్రెడిట్ కార్డ్ లింక్ చెయ్యడానికి OTP లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి. దీంతో క్రెడిట్ కార్డ్ విజయవంతంగా లింక్ అవుతుంది.
ఇప్పటి నుంచి మీ క్రెడిట్ కార్డ్ ను UPI ద్వారా పేమెంట్ల కోసం ఉపయోగించవచ్చు.
UPI IDని క్రియేట్ చేయండి:
మీ క్రెడిట్ కార్డ్‌ను లింక్ చేసిన తర్వాత లావాదేవీల కోసం ఒక ప్రత్యేక UPI IDని క్రియేట్ చేయండి.
మీ UPI IDని ఉపయోగించడానికి యాప్ ప్రొఫైల్ లోకి వెళ్లి "UPI ID"ని ఎంచుకోండి.
ఎక్కడైనా పేమెంట్స్ చేసేటప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేయడం లేదా ఫోన్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు లింకైన క్రెడిట్ కార్డ్‌ను సెలెక్ట్ చేయండి.
క్రెడిట్ కార్డు పిన్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయండి.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు
ప్రస్తుతం NPCI UPI యాప్‌లతో RuPay క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే లింక్ చేయడానికి అనుమతిస్తుంది. వీసా, మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్‌లకు ఇంకా అవకాశం లేదు. SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌తో సహా మొత్తం 22 బ్యాంకులు UPIతో RuPay క్రెడిట్ కార్డ్ ఇంటిగ్రేషన్‌ను మాత్రమే అనుమతిస్తాయి.
ప్రయోజనాలివే:
లావాదేవీలు రియల్ టైమ్‌లో ప్రాసెస్ అవుతాయి. పేమెంట్స్ త్వరగా, సింపుల్ గా పూర్తవుతాయి.
UPI చెల్లింపులకు అదనపు ఛార్జీలు ఉండవు. ఎక్కువ రేంజ్ లో పేమెంట్స్ చేస్తే మీకు హెచ్చరికలలు కూడా వస్తాయి. పేమెంట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే డబ్బులు డెబిట్ అవుతాయి.
ప్రతి లావాదేవీకి క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ట్రాన్సాక్షన్స్ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.