ఇంటర్నెట్ లేకపోయినా.. ఇలా ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్ చేయండి!
ఇంటర్నెట్ లేకుండా ఈ కాలంలో ఏ పని చేయలేం కదా.. UPI సేవతో సహా అనేక సదుపాయాలను మనం ఇంటర్నెట్ ద్వారానే ఉపయోగిస్తున్నాం. అయితే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే UPI ద్వారా చెల్లింపులు చేయవచ్చని మీకు తెలుసా? అది ఎలా చేయవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
UPI ద్వారా ట్రాన్సాక్షన్స్ ఎంత సింపుల్ అయిపోయాయంటే ఇప్పుడు టీ తాగినా కూడా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లిస్తున్నారు. కాస్త పెద్ద అమౌంట్ కూడా యూపీఐ ద్వారా చెల్లిస్తున్నారు. మరి.. అత్యవసరంగా డబ్బు చెల్లించాల్సిన సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఇబ్బందే కదా.. ఆన్‌లైన్ లావాదేవీలకు ఎక్కువగా ఉపయోగించే UPI సేవతో సహా అనేక సదుపాయాలను ఇంటర్నెట్ ద్వారానే ఉపయోగిస్తున్నాం. కానీ UPI ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే చెల్లింపులు చేయవచ్చు.
ఆఫ్‌లైన్‌లో మీ మొబైల్ ఫోన్ నుండే UPI చెల్లింపులు చేయవచ్చు. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఓ ప్రత్యేక సదుపాయాన్ని అందిస్తోంది. దీని కోసం మీరు మీ మొబైల్ నుంచి *99# అనే అధికారిక USSD కోడ్‌ను డయల్ చేయాలి. ఈ సేవను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది.
ఈ USSD కోడ్ ఉపయోగించడం ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్ కైనా డబ్బు పంపొచ్చు. అదేవిధంగా డబ్బు తీసుకోవడం కూడా చేయొచ్చు. మీ అకౌంట్ లోని బ్యాలెన్స్‌ను తనిఖీ చేయొచ్చు. UPI పిన్ నంబర్‌ను క్రియేట్ చేయొచ్చు. లేదా అవసరమైతే మార్చుకోవడం కూడా చేయొచ్చు. ఇలా అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను సులభంగా ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది.
ఇంటర్నెట్ కనెక్షన్ లేని సమయంలో UPI చెల్లింపు చేయడానికి ముందుగా మీ ఫోన్‌లో *99# అనే USSD కోడ్‌ను డయల్ చేయండి.
స్క్రీన్‌పై కొన్ని ఆప్షన్స్ తో మెనూ కనిపిస్తుంది.
1. డబ్బును పంపడం
2. డబ్బును స్వీకరించడం
3.బ్యాలెన్స్ ఎంక్వైరీ
4. మీ సమాచారం
ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
ఒక వేళ మీరు డబ్బు పంపాలనుకుంటే డబ్బు రిసీవ్ చేసుకొనే వ్యక్తి UPI ఖాతాతో లింక్ అయిన మొబైల్ నంబర్‌ను టైప్ చేసి సెండ్ క్లిక్ చేయండి. తర్వాత పంపాల్సిన మొత్తాన్ని టైప్ చేసి మళ్ళీ సెండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అంతే ఈజీగా మీరు మనీ ట్రాన్స్ ఫర్ జరుగుతుంది.
UPI లావాదేవీని ఆఫ్‌లైన్‌లో నిర్వహించడానికి ఈ USSD సేవ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఈ సేవను నిలిపివేయడానికి కూడా అవకాశం ఉంది.