MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఇలా చేస్తే 30 రోజుల్లోనే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది

ఇలా చేస్తే 30 రోజుల్లోనే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది

మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? ఇలా చేస్తే కేవలం 30 రోజుల్లో క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవచ్చు. ఆ సులభమైన మార్గాలేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 24 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం కాలంలో క్రెడిట్ లేదా సిబిల్ స్కోర్ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఎందుకంటే ఏ లోన్ తీసుకోవాలన్నా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ముందుగా చూసేది సిబిల్ స్కోర్ నే. ఇది వ్యక్తుల ఫైనాన్షియల్ స్టెబిలిటీని తెలియజేస్తాయి.

హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఎలాంటి లోన్ పొందాలన్నా సిబిల్ స్కోర్ చాలా అవసరం. అవసరం మాత్రమే కాదు సిబిల్ స్కోర్ బాగుంటేనే లోన్ దక్కుతుంది. అందుకే ఏదైనా ఋణానికి దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేసుకోవడం ముఖ్యం. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే దాన్ని మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యం. 30 రోజుల్లో మీ స్కోర్‌ను మెరుగు పరచుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలంటే మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే.. బిల్లులు సకాలంలో సక్రమంగా కట్టడం. ఎప్పుడూ ఆలస్యం చేయకుండా ఉండటం. అది క్రెడిట్ కార్డ్ బిల్లయినా, లోన్ EMI అయినా ఇలా మరే ఇతర చెల్లింపు అయినా దాని గడువు తేదీలోపు చెల్లించడం మంచిది. మీకు వీలైతే అంతకు ముందే చెల్లిస్తే ఇంకా మంచిది. సకాలంలో చెల్లింపులు ఆర్థిక క్రమశిక్షణను ప్రతిబింబిస్తాయి. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచడానికి ఉపయోగపడుతుంది. 

35

క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకుండా లోన్స్ కి అప్లై చేసినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే క్రెడిట్ హిస్టరీ మీ ఫైనాన్షియల్ క్యారెక్టర్ కి రికార్డుగా పనిచేస్తుంది. అందువల్ల సరైన సిబిల్ స్కోర్ ని మెయింటెయిన్ చేయడం చాలా ముఖ్యం. మీ సిబిల్ స్కోర్ బాగుందంటే లోన్స్ ఇచ్చే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మిమ్మల్ని ధీమా నమ్మి లోన్స ఇస్తాయి.

ఇంకో విషయం ఏంటంటే మీరు ఉపయోగించినా, ఉపయోగించకున్నా క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే మీ సిబిల్ స్కోర్ బాగుంటుంది. మీ అవసరానికి తగ్గట్టుగా లిమిటెడ్ గా క్రెడిట్ కార్డును ఉపయోగించి బిల్లులు సకాలంలో కట్టేస్తే మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. 

45

మీ క్రెడిట్ స్కోర్‌ను వేగంగా మెరుగుపరచడానికి మరొక మంచి ఆలోచన ఏంటంటే క్రెడిట్ కార్డు వాడటానికి లిమిటేషన్స్ పెట్టుకోండి.  అంటే మీ క్రెడిట్ పరిమితి 30 % కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. 

ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1 లక్ష అయితే మీరు రూ.30,000 లేదా అంతకంటే తక్కువే ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల 30 రోజుల్లో మీ స్కోర్‌ మెరుగుపడుతుంది. సకాలంలో బిల్లు చెల్లింపుల వల్ల కూడా మీరు బాధ్యతాయుతంగా క్రెడిట్ నిర్వహిస్తున్నారని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు నమ్ముతాయి. 

55

మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ని పెంచమని కోరడం వల్ల కూడా మీ క్రెడిట్ స్కోర్‌ మెరుగుపడటానికి ఛాన్స్ ఉంటుంది. మీ పరిమితి పెరిగినా ఖర్చు స్థిరంగా ఉంటే ఆటోమెటిక్ గా మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి తగ్గుతుంది.

మీ బిల్ పేమెంట్ కూడా సక్రమంగా ఉంటే చాలా మంది ఋణదాతలు మీ లోన్ అప్లికేషన్ ని అంగీకరించడానికి వెనుకాడరు. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచమని మీ బ్యాంకులను ఆన్‌లైన్ లో కూడా  అడగవచ్చు. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: ఇరాన్-అమెరికా చర్చల్లో ప్రతిష్టంభన.. పసిడి ధరల్లో మళ్లీ జోరు
Recommended image2
EPFO: పీఎఫ్‌ బ్యాలెన్స్ తెలుసుకోవ‌డం ఇప్పుడు మ‌రింత ఈజీ.. వాట్సాప్ ద్వారా
Recommended image3
Cyber Attack: కేవలం 20 నిమిషాల్లో రూ. 60 వేల కోట్లు మాయం.. అతిపెద్ద డిజిటల్ చోరీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved