Whiskey: తెలుగోళ్లు ఎంతగా విస్కీ తాగేస్తున్నారో తెలుసా? దేశంలో ఇదిగో ఈ రాష్ట్రాలే టాప్
మనదేశంలో విస్కీ (Whiskey) ప్రియులు అధికంగానే ఉన్నారు. అత్యధికంగా విస్కీ తాగే భారత రాష్ట్రాల జాబితా విడుదలైంది. మన తెలుగు రాష్ట్రాల్లో విస్కీ తాగే రాష్ట్రాల జాబితాలో ఏ స్థానంలో ఉందో తెలుసుకోండి.

విస్కీ ఎక్కువగా తాగే రాష్ట్రం
భారత్‌లో విస్కీకి చాలా డిమాండ్ ఎక్కువ. మద్యం తాగేవారి మొదటి ఎంపిక విస్కీనే. ప్రీమియం విస్కీకి డిమాండ్ ఇప్పుడు ఎక్కువగానే ఉంది. అందులోనూ మేడ్ ఇన్ ఇండియా, విదేశీ బ్రాండ్లకు చెందిన విస్కీకి మంచి గిరాకీ ఉంది. దేశంలో అత్యధికంగా విస్కీ తాగే రాష్ట్రం ఏదో తెలుసుకోండి. అలాగే మన తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో నిలిచాయో తెలుసుకోండి.
నెంబర్ 1 రాష్ట్రం ఏది?
భారత్ లో విస్కీ మార్కెట్ అధికంగానే ఉంది. ఇది వేగంగా వృద్ధి చెందుతోంది కూడా. 2024-25 సంవత్సరానికి గాను అత్యధికంగా విస్కీ తాగే రాష్ట్రాల జాబితాను విడుదల చేశారు. ఇందులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రజలే అధికంగా విస్కీని వినియోగిస్తున్నారు. అందుకే కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది.
విస్కీ అమ్మకాలు
నివేదిక ప్రకారంం 2024-25లో కర్ణాటకలో 6.88 కోట్ల కేసుల విస్కీ అమ్ముడైనట్టు తెలుస్తోంది. దేశ మొత్తం ప్రీమియం విస్కీ అమ్మకాల్లో కర్ణాటక వాటా 17 శాతంగా ఉంది. గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
రెండో స్థానంలో తమిళనాడు
విస్కీలో ప్రీమియం విస్కీని తాగేందుకు ఎక్కువ మంది ఆదరణ చూపిస్తున్నారు. అత్యధికంగా ప్రీమియం విస్కీ తాగే రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. దేశ మొత్తం అమ్మకాల్లో తమిళనాడు వాటా 16 శాతం ఉంది. 2024-25లో ఇక్కడ 6.47 కోట్ల కేసులు అమ్ముడయ్యాయి.
దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యం
ప్రీమియం విస్కీ తాగే రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలదే ఆధిపత్యంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ప్రజలు 9 శాతం మంది విస్కీని తాగేస్తున్నారు. అంటే 3.71 కోట్ల కేసులు తాగేస్తున్నారు. దీంతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్ 3.55 కోట్ల కేసులు విస్కీ అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది.