Business Ideas: నెలకు రూ. 1 లక్ష సంపాదించాలంటే...ఈ ఈజీ బిజినెస్ చేస్తే సరిపోతుంది..పెట్టుబడి ఎంతంటే..?
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించింది అందులో మొదటిది ముద్రా రుణాలు. ముద్ర రుణాల కోసం అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో పొందే అవకాశం ఉంది. మీరు కనుక నిరుద్యోగులు అయి ఉండి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ముద్ర రుణం ద్వారా సొంత వ్యాపారం చేసుకొని ఆదాయం పోతే అవకాశం ఉంది.
ముద్ర రుణాల ద్వారా బ్యాంకులు 50 వేల నుంచి పది లక్షల రూపాయల వరకు ఎలాంటి తనఖా లేకుండానే లోన్స్ అందిస్తున్నాయి. ఈ లోన్స్ అన్నీ కూడా మీరు సులభ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే ముద్ర రుణాలపై వడ్డీ రేటు చాలా తక్కువ. ముద్ర రుణం ద్వారా మీరు ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే బేకరీ వ్యాపారం ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.
ప్రస్తుత కాలంలో పట్టణాల్లో జనాభా పెరుగుతూ ఉంది అలాగే వారి అభిరుచులు కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా బేకరీ ఉత్పత్తులను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మీరు నివసిస్తున్న ప్రాంతం అక్కడి ప్రజల జనాభాను అంచనా వేసుకొని బేకరీ ప్రారంభిస్తే మంచిది. . ఈ మధ్యకాలంలో డాక్టర్లు అనారోగ్యం సమయంలో బ్రెడ్డు లేక బన్ను తినమని సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో బేకరీలో ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
సాధారణంగా ఒక బేకరీ ఏర్పాటు చేయడానికి కనీస పెట్టుబడి రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు అవుతుంది. బేకరీలో బ్రెడ్డు బన్ను తో పాటు బిస్కెట్లు, ఎగ్ పఫ్ కర్రీ పఫ్ వంటి ఇతర ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచి బేరం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బేకరీలో బర్త్డే కేకులకు మంచి డిమాండ్ ఉంటుంది. మీరు కూడా బర్త్డే కేక్ డిజైనింగ్ నేర్చుకున్నట్లయితే చక్కటి బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది.
బేకరీ ఏర్పాటు కోసం ఒక జన సమర్థత ఉన్న ప్రదేశంలో షాపు ఏర్పాటు చేసుకుంటే మంచిది. . అంతేకాదు బేకరీ వ్యాపారంలో లాభం రావాలంటే మీరు స్వయంగా బేకరీ ఉత్పత్తుల తయారీ చేస్తే మంచిది తద్వారా మీరు అధిక మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది పని వాళ్ళ మీద ఆధారపడితే పెద్ద ఎత్తున లాస్ వచ్చే అవకాశం ఉంది కావున మీరు స్వయంగా రంగంలోకి దిగితేనే మంచిది.
బేకరీ ఉత్పత్తుల తయారీ కోసం మీరు పలు హోటల్ మేనేజ్మెంట్ స్కూల్స్ కాలినరీ ఆర్ట్స్ అకాడమీ వంటి సంస్థల్లో బేకరీ ఉత్పత్తులకు సంబంధించిన షార్ట్ టర్మ్ కోర్సులు అందిస్తున్నారు వీటిల్లో మీరు కోర్సులు చేయడం ద్వారా బేకరీ ఉత్పత్తులపై సమగ్ర అవగాహన వచ్చే అవకాశం ఉంది. మీ బిజినెస్ పెరిగే కొద్దీ పిజ్జా బర్గర్ వంటి వినూత్నమైన ఫుడ్ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉంచినట్లయితే చక్కటి బిజినెస్ చేసే అవకాశం ఉంది. బేకరీ ఉత్పత్తులపై ప్రతి నెల ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.