Honda City Apex: రూ.13 లక్షలకే హోండా సిటీ ప్రీమియం సెడాన్
Honda City Apex: కొత్త హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ బెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. కొత్త విషయం ఏంటంటే.. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కేవలం రూ.25 వేలు మాత్రమే ధర ఎక్కువ. కొత్త అపెక్స్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి.

హోండా కార్స్ ఇండియా తన ప్రముఖ సెడాన్ కారు సిటీ కొత్త అపెక్స్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రారంభ ధర రూ.13.30 లక్షలు మాత్రమే. స్టాండర్డ్ మోడల్ కంటే ఇది కేవలం రూ.25,000 ఎక్కువ.
1998లో లాంచ్ అయిన హోండా సిటీ ఇప్పటికీ మార్కెట్లో తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ కారు లేటెస్ట్ ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ధర, వేరియంట్లు
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ ధర రూ.13.30 లక్షల నుండి రూ.15.62 లక్షల మధ్య ఉంది. ఈ కారు VMT, VCV, VX MT, VX CVT వేరియంట్లలో లభిస్తుంది.
కొత్తగా ఏముంది?
ఈ లిమిటెడ్ ఎడిషన్ టెక్నికల్‌గా ఐదవ తరం హోండా సిటీ మాదిరిగానే ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ బూట్ మీద 'అపెక్స్ ఎడిషన్' బ్యాడ్జ్, ముందు ఫెండర్లపై 'అపెక్స్ ఎడిషన్' బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. ప్రీమియం లెదరెట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, లెదరెట్ కన్సోల్ గార్నిష్, ప్రీమియం లెదరెట్ డోర్ కుషనింగ్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డోర్ పాకెట్లపై ఏడు రంగుల రిథమిక్ యాంబియంట్ లైటింగ్ సెడాన్ ప్రత్యేకతలు. అదనంగా ఈ కారు సీట్లలో ప్రత్యేక అపెక్స్ ఎడిషన్ కుషన్లు, సీట్ కవర్లు ఉన్నాయి.
ఇంజిన్, పవర్
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ కూడా 1.5L, వాటర్ కూల్డ్ ఇన్‌లైన్, ఫోర్ సిలిండర్, i-VTEC, DOHC VTCతో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ సెడాన్ 6,600 rpm వద్ద 119 bhp పవర్ అవుట్‌పుట్, 4,300 rpm వద్ద 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా మీరు 6 స్పీడ్ మాన్యువల్, 7స్పీడ్ CVT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ల మధ్య మీకు నచ్చిన మోడల్ ను ఎంచుకోవచ్చు.
పోటీ కార్లు
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లతో పోటీపడుతుంది.
ఇది కూడా చదవండి: రూ.35 వేలకే 60 కి.మీ. ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదిగో!