MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • అక్టోబర్ 30న సెల్లో వరల్డ్ లిమిటెడ్ IPO.. ఒక్కో షేరుపై డిస్కౌంట్ కూడా.. కొద్దిరోజులు ఛాన్స్..

అక్టోబర్ 30న సెల్లో వరల్డ్ లిమిటెడ్ IPO.. ఒక్కో షేరుపై డిస్కౌంట్ కూడా.. కొద్దిరోజులు ఛాన్స్..

ముంబై: ప్రముఖ హోం అప్లియన్సెస్  తయారీ సంస్థ సెల్లో వరల్డ్ లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 30న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ.617 నుంచి రూ.648 వరకు ఉండనుంది. పెట్టుబడిదారులు కనీసం 23 షేర్లు లేదా అంతకంటే  ఎక్కువ షేర్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ ipo నవంబర్ 1తో ముగుస్తుంది.
 

Ashok Kumar | Updated : Oct 28 2023, 04:39 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Asianet Image

ఐదు రూపాయల ఫెస్  వాల్యూతో  కంపెనీ ప్రమోటర్ల వద్ద ఉన్న ఈక్విటీ షేర్లను IPO ద్వారా విక్రయిస్తారు. దీని ద్వారా 1900 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హత ఉన్న ఉద్యోగుల కోసం  క్యాటగిరి షేర్లు  రిజర్వ్ చేయబడింది. ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.61 తగ్గింపు కూడా లభిస్తుంది.  
 

23
Asianet Image

ఈ సంస్థ 1962లో సెల్లో ప్లాస్టిక్స్ ఇండస్ట్రియల్ వర్క్స్‌గా సెల్లో బ్రాండ్ క్రింద కన్స్యూమర్   హౌస్ వేర్, స్టేషనరీ అండ్  మౌల్డ్ ఫర్నీచర్     క్యాటగిరిలో అనేక  ఉత్పత్తులతో ప్రారంభించింది. 2023 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 29.86 శాతం పెరుగుదలతో రూ. 285 కోట్లు.
 

33
Asianet Image

ట్యాక్స్ ఫ్రీ  గేమింగ్ కంపెనీలు
బకాయిలు చెల్లించనందుకు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు పన్ను శాఖ పంపిన షోకాజ్ నోటీసుల మొత్తం లక్ష కోట్లు దాటింది. అక్టోబర్ 1, 2023 వరకు 18 శాతానికి బదులుగా 28 శాతం గూడ్స్ అండ్  సర్వీస్  ట్యాక్స్ (GST) చెల్లింపుపై ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలు ప్రభుత్వంతో విభేదిస్తున్నాయి. అయితే అక్టోబర్ 1 నుంచి మాత్రమే 28 శాతం పన్ను వర్తిస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి.

అక్టోబరు 1న సవరణ అనేది ఇప్పటికే అమల్లోకి వచ్చిన చట్టంపై స్పష్టత ఇవ్వడమేనన్నది ప్రభుత్వ వైఖరి. ఆగస్టు 2023లో జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో బెట్టింగ్‌తో కూడిన అన్ని ఆన్‌లైన్ గేమ్‌లపై 28 శాతం GST విధించేలా చట్టాన్ని సవరించాలని నిర్ణయించారు.

కౌన్సిల్ నిర్ణయంతో, ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలను భారీగా పన్ను చెల్లించాలని ఆదేశించింది. 2022లో గేమింగ్ కంపెనీల మొత్తం ఆదాయం దాదాపు రూ.20,000-22,000 కోట్లుగా ఉందని, అయితే వాటిపై పన్ను డిమాండ్ రూ.55,000 కోట్లుగా ఉందని కంపెనీలు ఆరోపించాయి. గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ సుమారు రూ.25,000 కోట్ల పన్ను చెల్లింపును సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.

పన్ను శాఖకు అందిన షోకాజ్ నోటీసును రద్దు చేయాలంటూ గేమింగ్ కంపెనీ డెల్టా కార్పొరేషన్ చేసిన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు గోవా బెంచ్, అనుమతి లేకుండా తుది ఉత్తర్వులు జారీ చేయవద్దని పన్ను శాఖను కోరింది. 

సెప్టెంబరు 22న డెల్టా కార్పొరేషన్‌కు రూ.11,140 కోట్ల పన్ను నోటీసులు అందగా, దాని అనుబంధ సంస్థలకు కూడా రూ.5,682 కోట్ల నోటీసులు అందాయి.

Ashok Kumar
About the Author
Ashok Kumar
 
Recommended Stories
Top Stories