Union budget: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్! 25శాతం పెరిగిన స్పెషల్ అలవెన్స్
కేంద్రం ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ తర్వాత ఉద్యోగుల స్పెషల్ అలవెన్స్ 25% పెరిగింది. DA పెరగకపోయినా.. స్పెషల్ అలవెన్స్ పెరగడం వల్ల మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం గణనీయంగా పెరగనుంది.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్పెషల్ అలవెన్స్ 25 శాతం పెంచింది. దీంతో ఉద్యోగి జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఒకేసారి 25శాతం
7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DA జనవరిలో 53 శాతానికి పెరిగింది. కాబట్టి అనేక శాఖలు స్పెషల్ అలవెన్స్ మొత్తాన్ని సవరించాలని కోరాయి. ప్రస్తుతం DA పెరగకపోయినా.. స్పెషల్ అలవెన్స్ ఒకేసారి 25% పెరిగింది.
పిల్లల చదువులకు..
ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం వారు స్పెషల్ అలవెన్స్ పొందుతారు. ఈసారి స్పెషల్ అలవెన్స్ 25 శాతం పెరిగింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం..
కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం, DA 50% పెరిగితే, పిల్లల చదువులకు వచ్చే స్పెషల్ అలవెన్స్ 25% పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ఈ పెరుగుదల జరిగింది.
చదువు కోసం..
స్పెషల్ అలవెన్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం నెలకు రూ.2812.5 చదువు ఖర్చు.. రూ.8437.5 హాస్టల్ ఫీజు వస్తుంది.
వికలాంగుల పిల్లలకు స్పెషల్ అలవెన్స్
ఒకవేళ పిల్లలు వికలాంగులైతే, నెలకు రూ.5625 వస్తుంది. ఉద్యోగి వికలాంగ మహిళ అయితే, ఆమెకు కూడా పిల్లల సంరక్షణ కోసం రూ.3750 ఇస్తారు.