MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • BSNLకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌: 6 వేల కోట్ల పెట్టుబడి: Jio, Airtelకి షాక్

BSNLకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌: 6 వేల కోట్ల పెట్టుబడి: Jio, Airtelకి షాక్

BSNL టెలికాం సంస్థ 4G నెట్‌వర్క్ అభివృద్ధి కోసం రూ.6,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఈ పెట్టుబడి BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, మార్కెట్లో పోటీని తట్టుకొని నిలవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుదని వినియోగదారులు భావిస్తున్నారు. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 04 2024, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

4జీ నెట్‌వర్క్ సౌకర్యం కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కి కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లకు పైగా గ్రాంట్‌ను ప్రకటించనుంది. 4G నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అధునాతన పరికరాల కొనుగోలు కోసం కేంద్రం స్వయంగా అంతర్గత పెట్టుబడి పెడుతోంది. ఇది BSNLకు ఎంతో సహాయం చేసే స్టెప్‌ అని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లను నిలుపుకోవడానికి ఈ చర్య సహాయపడుతుందంటున్నారు. 4జీ నెట్ వర్క్ పూర్తిస్థాయిలో పనిచేస్తే బీఎస్ఎన్ఎల్ కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ఇన్‌వార్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(DoT) త్వరలో క్యాబినెట్ నుండి ఆమోదం పొందనుందని సమాచారం. గత సంవత్సరం BSNL 1,00,000 4G సైట్‌ల కోసం 19,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ కొనుగోలు ఆర్డర్‌ చేసింది. ఇప్పుడు 13,000 కోట్లకు అసలు కొనుగోలు ఆర్డర్‌ను ఉంచారు. దీంతో ఇప్పుడు రూ.6 వేల కోట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 
 

35

ప్రభుత్వం 2019 నుండి BSNL, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(MTNL)లను కొనుగోలు చేసింది. మూడు పునరుద్ధరణ ప్యాకేజీల కింద ప్రభుత్వం రూ. 3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ ప్యాకేజీల కారణంగా BSNL, MTNL FY 2021 నుండి నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. ప్రస్తుతం BSNL నెమ్మదిగా 4G సేవలను అందిస్తోంది. 

టెలికాం మార్కెట్లో BSNL వాటా జూన్ 2024 నాటికి 7.33 శాతంగా ఉంది. డిసెంబర్ 2020 నాటికి BSNL 10.72% వాటాను కలిగి ఉంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియోకు 40.71% వినియోగదారులు, ఎయిర్‌టెల్‌కు 33.71% వినియోగదారులు ఉన్నారు. 
 

45

దేశీయంగా అభివృద్ధి చేసిన CDoT-TCS స్టాక్ ఆధారంగా 4G నెట్‌వర్క్‌ను రూపొందించాలని ప్రభుత్వం BSNLని ఆదేశించింది. కానీ ఈ లోకల్ స్టాక్ టెస్టింగ్ ప్రాసెస్ కారణంగా 4G నెట్‌వర్క్ సేవ ఆలస్యం అవుతోంది. అయితే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అందుకే మూడు కంపెనీలు కస్టమర్లకు స్మార్ట్ ఆఫర్లను అందిస్తున్నాయి. 

55

BSNL అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్‌లు ఇవిగో..
1. రూ.399 ప్లాన్: ఈ ప్లాన్‌ చెల్లుబాటు 80 రోజులు. 1 GB డేటాతో పాటు 100 SMS రోజువారీ ఇస్తారు. అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. 
2. రూ.499 ప్లాన్: ఈ ప్లాన్‌ చెల్లుబాటు 90 రోజులు. రోజుకు 1.5 GB డేటాతో పాటు 100 SMS వస్తాయి. అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌తో పాట Zing యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్రొవైడ్‌ చేస్తున్నారు. 
3. రూ.997 ప్లాన్: దీనికి 180 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌. రోజువారీ 3 GB డేటా, 100 SMS, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. 
4. రూ.1,999 ప్లాన్ : ఇది సంవత్సరం మొత్తం చెల్లుబాటు అయ్యే ప్లాన్‌. 2 GB రోజువారీ డేటా, 100 SMS, అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత లోకల్ & నేషనల్ రోమింగ్ కాల్‌లు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 
5. రూ.2,399 ప్లాన్: ఇది కూడా 365 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌. 3 GB డేటా రోజువారీ100 SMS అందిస్తున్నారు. అన్‌లిమిటెడ్‌ లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ చేసుకోవచ్చు. ఉచిత PRBT, BSNL ట్యూన్‌లకు ఉచిత సభ్యత్వం అవకాశం ఉంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image3
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved