MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • గూగుల్ ఎర్త్ 'టైమ్ ట్రావెల్' - మీరు 80 ఏళ్లు వెనక్కి వెళ్లొచ్చు..

గూగుల్ ఎర్త్ 'టైమ్ ట్రావెల్' - మీరు 80 ఏళ్లు వెనక్కి వెళ్లొచ్చు..

Google Earth - time travel : గూగుల్ కంపెనీకి చెందిన శాటిలైట్ ఇమేజరీ ప్లాట్ ఫామ్ గూగుల్ ఎర్త్ కు మ‌రికొన్ని కొత్త అప్డేట్లను వినియోగ‌దారుల కోసం తీసుకువ‌చ్చింది. దీంతో మీరు ఇప్పుడు 80 సంవ‌త్స‌రాల క్రితం వ‌ర‌కు టైమ్ ట్రావెల్ చేయ‌వ‌చ్చు. అప్పుడు భూప్ర‌దేశాలు ఏలా ఉండేవో చూడ‌వ‌చ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Sep 26 2024, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Google Earth - time travel :  కొత్త టెక్నాల‌జీల‌ను ప‌రిచ‌యం చేస్తూ అద్భుత‌మైన అనుభూతిని, మాన‌వ జీవ‌నాన్ని మ‌రింత సుల‌భ‌త‌రం చేయ‌డంలో గూగుల్ కీల‌క పాత్ర పోషిస్తోంది. స‌రికొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌పంచాన్ని మ‌న ముందర ఉంచుతోంది. ఈ క్ర‌మంలోనే మ‌రో అద్భుతంలో గూగుల్ ముందుకొచ్చింది. దీంతో 80 సంవ‌త్స‌రాల వెన‌క్కి టైమ్ ట్రావెల్ చేయ‌వ‌చ్చు. ఆ స‌మ‌యంలో ఇప్పుడున్న ప్రాంతాలు ఏలా ఉండేవో చూడ‌వ‌చ్చు. దీనిని త‌లుచుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది కాదా.. ! ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గూగుల్ అందిస్తున్న స‌ర్వీసుల‌లో గూగుల్ ఎర్త్ కూడా ఒక‌టి. Google Earth అనేది ఇత‌ర‌ ఉపగ్రహాల నుంచి భూమిని  చూస్తే ఏలా ఉంటుందో అలాంటి భూ దృశ్యాల‌ను అందిస్తుంది. అంటే గూగుల్ ఎర్త్ సర్వీసుల‌ను ప్రారంభించిన‌ప్ప‌టి నుంని భూమిని మానిట‌ర్ చేస్తూ దాని దృశ్యాల‌ను రికార్డు చేస్తోంది. 

అంటే భూ గ్ర‌హం పై ఉన్న ప్రాంతాల‌ను రికార్డు చేస్తుంది. ఉప‌గ్ర‌హాల నుంచి చూసిన‌ట్టుగా భూ గ్రహం, దాని అనేక స్థానాలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది గూగుల్ ఎర్త్. ఇది భూమి దృశ్యాల‌ను త్రీడీ రూపంలో అందిస్తుంది. వెబ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా భూ ప్రాంతాల‌ను చూడ‌టానికి వీలు క‌ల్పిస్తుంది. ప్రజలు వివిధ కోణాల నుండి నగరాలు, ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు.

35

ఎప్ప‌టిక‌ప్పుడు గూగుల్ ఎర్త్ త‌న సర్వీసును మెరుగుప‌రుస్తోంది. ఈ క్రమంలోనే 80 సంవ‌త్స‌రాల క్రితం భూమి ఎలా ఉంద‌నే రికార్డుల‌ను చూసే అవ‌కాశం వినియోగ‌దారుల‌కు అందిస్తోంది. అంటే  మిమ్మ‌ల్ని 1930వ దశకం నాటి కాలంలోకి తీసుకెళ్తుంది. 

ఇది ఒక టైమ్ ట్రావెలింగ్ లాంటిద‌నే చెప్పాలి. ఇక్క‌డ మ‌నం గ‌త కాలంలోకి వెళ్తాం. దీని కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ తన శాటిలైట్ ఇమేజరీ ప్లాట్ఫామ్ గూగుల్ ఎర్త్ లో కొన్ని కొత్త అప్డేట్లను తీసుకురానుంది. కొత్త ఫీచర్లను ఉపయోగించి మీరు 80 సంవత్సరాల వరకు వెళ్లి, ఆ కాలానికి చెందిన ఉపగ్రహ, వైమానిక చిత్రాలతో భూమిని, ఇక్క‌డి ప్రాంతాల‌ను చూడ‌వ‌చ్చు.

45

ప్రస్తుతం, గూగుల్ ఎర్త్ కొన్ని దశాబ్దాల క్రితం వరకు చాలా ప్రదేశాల చిత్రాలను చూడటానికి ప్రజలను అనుమతిస్తుంది. కొత్త అప్డేట్ తో లండన్, బెర్లిన్, వార్సా, పారిస్ వంటి కొన్ని నగరాల్లో 1930ల నాటి చిత్రాలు ఉంటాయని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాథమికంగా, చాలా ప్రదేశాలకు కాలపరిమితి రెట్టింపు అవుతుంది. ఇది ప్రజలను "టైమ్ ట్రావెల్" చేయడానికి, ఆ స‌మ‌యంలో ఆ ప్రాంతాలు ఏలా ఉన్నాయో చూడటానికి అనుమతిస్తుంది. 

వినియోగదారులు నగరాలను పక్కపక్కనే పెట్టి పోల్చి చూడవచ్చు. ఈ సంవత్సరాలలో అవి ఎలా మారిపోయాయో కూడా చూడవచ్చు.  ఈ వివ‌రాలు వెల్ల‌డించిన గూగుల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో శాన్ ఫ్రాన్సిస్కో 1938లో ఎలా ఉండేది-2024లో ఈ రోజు ఎలా ఉంది అనే వివ‌రాలతో రెండింటి మధ్య పోలికలతో చిత్రాల‌ను, వివిధ ర‌కాల డేటాను పంచుకుంది. భౌగోళికంగా ఏలా మారిపోయిందో ఈ  చిత్రాలు వివ‌రిస్తున్నాయి. 

55
Gigantic Ocean

Gigantic Ocean

1938లో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓడరేవులు ప్రధానంగా షిప్పింగ్ కోసం ఎలా ఉపయోగించబడ్డాయో నమూనా ఫోటో చూపిస్తుంది. అయితే, గూగుల్ అందించిన తాజా Google Earth చిత్రం ప్రకారం, ఈ ప్రదేశం ఇప్పుడు రెస్టారెంట్లు, క్రూయిజ్ షిప్‌లతో నిండిపోయింది.  వినియోగదారులు మొబైల్, వెబ్ రెండింటిలోనూ కొత్త Google Earth ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. రాబోయే వారాల్లో అప్‌డేట్‌లు విడుదల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

త‌న గూగుల్ ఎర్త్ అప్ డేట్ లో చారిత్రక చిత్రాలతో పాటు, దాదాపు 80 దేశాల్లో గూగుల్ మ్యాప్స్‌లో వీధి వీక్షణను కూడా విస్తరిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ ఎర్త్, గూగుల్ మ్యాప్స్‌లో వాటి నాణ్యతను మెరుగుపరచడానికి కంపెనీ ప్ర‌ణాళిక‌లు చేసింద‌నీ, రాబోయే కాలంలో చిత్రాలు, భూ దృశ్యాలు మ‌రింత స్పష్టంగా  ఉంటాయ‌నీ, దీని కోసం కొత్త AI మోడల్‌ల వైపు ముందుకు న‌డుస్తున్న‌ద‌ని కూడా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Recommended image2
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Recommended image3
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved