Gold Rate: బంగారం షాపింగ్ వెళ్లేవారికి గుడ్ న్యూస్, 10 గ్రాముల బంగారం త్వరలోనే రూ.50 వేల దిగువకు పడే చాన్స్..
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. పసిడి మార్కెట్లో బంగారం ధర ఏకంగా 500 రూపాయలు తగ్గింది. ఇదే ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధరలు ఏకంగా 50 వేల రూపాయల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధర భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా పరిస్థితులు సద్దుమణుగుతున్న కారణంగా పసిడి ధరలు తగుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 59,860 రూపాయిలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54830 రూపాయలుగా ఉంది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు భారీగా తగ్గుతున్నాయి.
బంగారం ధరలు చాలా కాలం తర్వాత 60 వేల దిగువకు దిగి వచ్చాయి. దీంతో పసిడి ప్రియులకు బంగారు నగలు షాపింగ్ చేసేందుకు జోష్ నింపుతోంది. ముఖ్యంగా బంగారు నగలు గడచిన మూడు నెలలుగా గరిష్ట స్థాయిలో ఉన్నాయి ఆల్ టైం రికార్డులను తాకాయి. ఈ సంవత్సరంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో నగల షాపింగ్ చేసే వారికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వచ్చింది. . అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పసిడి ధరలు తగ్గుతున్నాయి.
ముఖ్యంగా అమెరికాలో నెలకొన్న రుణ సంక్షోభం గత నెల 31వ తేదీన సమస్య పోయింది. అప్పటినుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. జూన్ ఒకటో తారీకు నుంచి జూన్ 15వ తారీకు వరకు గమనించినట్లయితే, పసిడి ధరలు వరుసగా తగ్గాయి. అంతర్జాతీయంగా గమనించినట్లయితే అమెరికాలో ఒక ఔన్స్ (31 గ్రాములు) బంగారం ధర 2030 డాలర్ల నుంచి 1930 డాలర్లకు పడిపోయింది. ఇదంతా కూడా కేవలం ఒక నెల రోజుల వ్యవధిలో జరిగిపోయింది.
అంటే దాదాపు 100 డాలర్లు పరిస్థితి ధర పతనమైంది. అందుకే రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి జూన్ ఒకటవ తేదీన భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,300 రూపాయలు పలికింది. సరిగ్గా 14 రోజుల్లో అంటే రెండు వారాలు గడిచేసరికి బంగారం ధర 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 59, 860 రూపాయలు పలికింది. అంటే సుమారు 500 రూపాయలు తగ్గిపోయింది.
ఈ లెక్కన చూస్తే బంగారం ధర భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం ఉందని అర్థం అవుతోంది. అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గి రావడానికి అమెరికా ప్రభుత్వం జారీ చేసే బాండ్ల విలువ పెరిగింది. ఈ బాండ్లను పలు దేశాలు సంస్థలు కొనుగోలు చేస్తుంటాయి. గతంలో రుణ సంక్షోభం సమయంలో బాండ్ల మార్కెట్ నుంచి మదుపుదారులు వైదొలగి, పసిడి మార్కెట్ వైపు వెళ్లారు. ఇప్పుడు బాండ్ల మార్కెట్లో డిమాండ్ రాగానే పసిడి మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారు. దీంతో బంగారం ధర తక్కువ ముఖం పడుతుంది.
ఒకవైపు స్టాక్ మార్కెట్ కూడా బలంగా ట్రేడ్ అవుతోంది ఈ ప్రభావం కూడా బంగారంపై పడుతోంది స్టాక్ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది అన్నది ప్రాథమిక సూత్రం. ఈ నేపథ్యంలో బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర అతి త్వరలోనే 55 వేల రూపాయల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర 50 వేల దిగువకు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు