MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Gold : బంగారం ధర త్వరలోనే రూ.1 లక్ష దాటడం ఖాయం..అందుకు కారణాలు తెలుసుకుందాం...

Gold : బంగారం ధర త్వరలోనే రూ.1 లక్ష దాటడం ఖాయం..అందుకు కారణాలు తెలుసుకుందాం...

బంగారం ప్రస్తుతం 61 వేల రూపాయలు దాటిపోయింది. దీంతో పసిడి ధర అతి త్వరలోనే ఒక లక్ష దాటడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మధ్యతరగతి ప్రజలు మాత్రం ఇకపై ఒక గ్రాము కొనాలన్నా, రూ. 10,000 ఖర్చు చేయాల్సి వస్తుందా, అని ఇప్పటినుంచే ఆందోళన చెందుతున్నారు.

2 Min read
Author : Krishna Adhitya
| Updated : Apr 10 2023, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బంగారం ధర అతి త్వరలోనే ఒక లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  అయితే దీనికి కారణాలు లేకపోలేదు. గడచిన నాలుగు వారాలుగా మనం గమనించినట్లయితే బంగారం ధర ఏకంగా 60 వేల రూపాయలు దాటిపోయింది. దీంతో ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద బంగారం ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. బంగారం ధర భవిష్యత్తులో ఒక లక్ష రూపాయలు దాటడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 మరోవైపు పసిడి ప్రియులు మాత్రం బంగారం పది గ్రాముల ధర ఒక లక్ష రూపాయలు అయితే  ఇక ఆభరణాలు కొనుగోలు చేయడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు.  ఈ నేపథ్యంలో అసలు బంగారం ఎందుకు ఇంతలా పెరిగిపోతోంది.  దీనికి గల కారణాలు ఎంతో మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 
 

35

బంగారం ధర రోజురోజుకు భారీగా పెరుగుతోంది. అయితే మనం చరిత్రలోకి వెళ్లి చూసినట్లయితే సరిగ్గా 23 సంవత్సరాల క్రితం అంటే 2000 సంవత్సరంలో బంగారం ధర 10 గ్రాములకు గాను కేవలం 4,400  మాత్రమే ఉంది.  ప్రస్తుతం బంగారం ధర నేడు 61000 దాటింది.  అంటే గడచిన 23 సంవత్సరాల్లో బంగారం ధర 15 రెట్లు పెరిగింది. 2010 సంవత్సరంలో బంగారం ధర 18,500 వద్ద పలికింది. గత దశాబ్ద కాలంలోనే బంగారం ధర విపరీతంగా పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. 
 

45

ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో కూడా  బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపుదారులు ఎక్కువగా ఆసక్తి చూపించారు.  అయితే బంగారం ధరలు 2020 సంవత్సరం తర్వాత కొద్దిమేర తగ్గాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా ఒక ఔన్స్ (31 గ్రాములు)  బంగారం ధర దాదాపు 2000 డాలర్లు దాటింది. దీంతో అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.  మరోవైపు బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రపంచవ్యాప్తంగా డాలర్ సంక్షోభం కూడా కారణంగా చెబుతున్నారు డాలర్ బలపడితే బంగారం ధర కూడా తగ్గుతుంది కానీ ప్రస్తుతం డాలర్ ధర బలంగానే ఉన్నప్పటికీ అమెరికన్ బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభం బంగారం ధరలు పెరిగేందుకు దోహదం అవుతున్నాయి. 
 

55

అమెరికాలో వరుసగా బ్యాంకులు దివాలా తీయడం వల్ల కూడా, ప్రజలు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి నిష్క్రమించి బంగారం కొనుగోలు చేసేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూస్తారు. అందుకే బంగారం ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి. ఇదే ట్రెండు కొనసాగితే ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు ఒక లక్ష రూపాయలు వరకు  తాకే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.  అందుకు తగ్గట్టే బంగారం ధర గత మూడు నెలలుగా మన గమనించినట్లయితే విపరీతంగా పెరుగుతూ వస్తోంది. 

About the Author

KA
Krishna Adhitya
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved