దీపావళి తరువాత బంగారం, వెండి కొనేవారికి మంచి టైం.. నేడు 10 గ్రాముల తులం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..
ఒక వెబ్‌సైట్ ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం ప్రారంభ ట్రేడ్‌లో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది, దింతో పది గ్రాముల ధర రూ. 61,690 వద్ద, అలాగే 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.56,550గా ఉంది. వెండి ధర కూడా ఇవాళ మారలేదు, ఒక కిలో ధర రూ.76,000 వద్ద ఉంది.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా హైదరాబాద్ ధరలకు సమానంగా రూ.61,690 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,840,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్ ధరలతో సమానంగా రూ.56,550 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,550,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,000గా ఉంది.
గత వారం 2.2 శాతం పెరిగిన తర్వాత, 0043 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్సుకు $1,975.80 వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పడిపోయి $1,978.50కి చేరుకుంది.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.6 శాతం పెరిగి $23.83 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం $892.58 డాలర్ల వద్ద స్థిరపడింది. పల్లాడియం ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి $1,035.77 డాలర్లకు చేరుకుంది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,000 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 వద్ద ట్రేడవుతోంది.
బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ 24 మించదు, క్యారెట్ ఎక్కువ ఉంటే స్వచ్ఛమైన బంగారంగా పరిగణించబడుతుంది.
22 అండ్ 24 క్యారెట్ బంగారం మధ్య తేడా తెలుసుకోండి.
24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే, 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలను తయారు చేయలేరని దయచేసి గమనించండి. అందువల్ల చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్లలో బంగారాన్ని విక్రయిస్తారు.