Gold Rate: బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 6000 పడిపోయే చాన్స్...కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం ధరలు శ్రావణమాసంలో కొద్దిగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పసిడి ధరలు హైదరాబాదులో ప్రస్తుతం సోమవారం చూసినట్లయితే , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,220 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,220 రూపాయలు పలుకుతోంది.
సెప్టెంబర్ 15 నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది. దీంతో శ్రావణమాసం ముగిసిపోయేందుకు కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే అటు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరిగాయి. అమెరికా గోల్డ్ మార్కెట్లో బంగారం ధర ఒక ఔన్సు అంటే 31 గ్రాములు ప్రస్తుతం 1941 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదిలా ఉంటే గత నెలలో బంగారం ధర 1890 డాలర్లకు పతనం అయ్యింది. కానీ ప్రస్తుతం ఉన్న రేంజ్ లో నుంచి పోల్చినట్లయితే బంగారం ధర దాదాపు 50 డాలర్లు పెరిగింది. అంటే సుమారు భారతీయ కరెన్సీలో 4000 రూపాయలు పెరిగింది. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్ నెల చివరకు వచ్చేనాటికి బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీని వెనక కారణం లేకపోలేదు. ప్రస్తుతం అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతోంది. దీంతో అమెరికా ట్రెజరీ బాండ్ల వడ్డీ కూడా పెరగనుంది. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారం వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా తగ్గి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధరలు అమెరికా మార్కెట్లో కూడా 1850 డాలర్లకు పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 100 డాలర్ల వరకు బంగారం ధర తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
కాగా నవంబర్ నెలలో దీపావళి నాటికి బంగారం ధరలు భారీగా తగ్గి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు అమెరికా మార్కెట్లో 1800 డాలర్లకు బంగారం ధర పడిపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే ఈ పరిణామం తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు. డాలర్ కూడా మరింత బలం పుంజుకుంటే మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధర 2023 మే నెలలో నమోదైన గరిష్ట స్థాయి 61,000 రూపాయల నుంచి, 55 వేల రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే సుమారు 6000 తగ్గి వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు కానీ, బంగారం ధరలు అస్థిరంగా ఉంటాయి. అమెరికా బాండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే బంగారం పై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య అమాంతం పెరిగే వీలుంటుంది.