MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate: బంగారం తులం 1 లక్ష రూపాయలు దాటేస్తోంది..లాభాలు పొందాలంటే నగలు కొనాలా..లేక గోల్డ్ బాండ్లు కొనాలా

Gold Rate: బంగారం తులం 1 లక్ష రూపాయలు దాటేస్తోంది..లాభాలు పొందాలంటే నగలు కొనాలా..లేక గోల్డ్ బాండ్లు కొనాలా

మీరు కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఫిజికల్ బంగారం కొంటే సరిపోదు.  బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు తద్వారా చక్కటి లాభాలు పొందినందుకు అనేక మార్గాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2 Min read
Author : Krishna Adhitya
Published : May 28 2023, 11:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీ వద్ద సరిపడా డబ్బు లేదా,  అలా అని మీరు బంగారం కొనుగోలు చేయడం మానేయకండి. కొద్ది మొత్తంలో బంగారు కొనుగోలు చేయడం ద్వారా కూడా మీరు లాభం పొందే వీలుంది. త్వరలోనే బంగారం ధర 1 లక్ష రూపాయల వరకు చేరే వీలుంది.  ఈ నేపథ్యంలో మీరు బంగారంపై పెట్టుబడులు పెట్టడం ఆకర్షణీయంగా మారుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే కేవలం బంగారు నగలు కొంటే సరిపోదు ఎందుకంటే నగల రూపంలో బంగారం కొంటే అందులో మేకింగ్ చార్జీలు, వీఏ రూపంలో అధికంగా చెల్లించాల్సి ఉంటుంది అంతేకాదు మీరు కొనుగోలు చేసే బంగారం 22 క్యారెట్ల అది ఉంటుంది అంటే దాని విలువ అప్పటికే కొద్దిగా తగ్గి ఉంటుంది అందుకే మీరు బంగారు నగలు కొన్నట్లయితే అవి  పెట్టుబడికి అంత పనికిరావనే చెప్పాలి.  కానీ బంగారు రుణాలు తీసుకోవడానికి మాత్రం చాలా ఉపయోగపడతాయి.  ఇలా కాకుండా మీరు పెరుగుతున్న బంగారం ధరపై  లాభాలు పొందాలంటే మాత్రం బంగారు బాండ్లను కొంటేనే మంచిది. 
 

35

గోల్డ్ ఈటీఎఫ్ లపై పెట్టుబడి
 గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు పెరుగుతున్న బంగారం ధరపై చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది వీటిని మీరు డిమార్ట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది కనీస చార్జీలు చెల్లించి డిమార్ట్ అకౌంట్ లో మీరు ఈ గోల్డ్ ట్రేడెడ్ ఫండ్స్ లో  పెట్టుబడి పెట్టవచ్చు.  మార్కెట్లో బంగారం ధర హెచ్చుతగ్గుల పైన ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ తగ్గడం పెరగడం జరుగుతుంటాయి వీటి నుంచి లాభాలు పొందడం కూడా చాలా సులభం. 

45

 డిజిటల్ గోల్డ్ లో పెట్టుబడి
 మీరు డిజిటల్ రూపంలో కూడా బంగారంలో పెట్టుబడులు పెట్టవచ్చు ఇందుకోసం పేటీఎం గూగుల్ పే అమెజాన్ పే లాంటి సంస్థలు  ఆఫర్ చేస్తున్న డిజిటల్ వాలెట్స్ లో మీరు బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకోవచ్చు.  వీలైతే మీరు డెలివరీ కూడా పొందే అవకాశం ఉంది అయితే డెలివరీ కోసం మేకింగ్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది కానీ దీని వల్ల లాభం ఏంటంటే మీరు కనీసం ఒక రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేసే వీలుంటుంది. 

55

సావరిన్ గోల్డ్ బాండ్స్
భారత ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు సురక్షితంగా బంగారంపై లాభం పొందే అవకాశం ఉంది.  ముఖ్యంగా ఇవి బాండ్స్ రూపంలో ఉండే హామీ పత్రాలు.  మార్కెట్లో బంగారం ధర పెరిగితే మీ బాండ్ విలువ కూడా పెరుగుతూ ఉంటుంది.  అదనంగా మీకు ప్రతి సంవత్సరం 2.5% వడ్డీ కూడా లభిస్తుంది.  ఈ సావరిన్ బాండ్స్ లో  వ్యక్తులు,  హిందూ అవిభాజ్య కుటుంబాలు  సైతం పెట్టుబడి పెట్టవచ్చు. 
 

About the Author

KA
Krishna Adhitya
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సామాన్యుడిపై మ‌రో దెబ్బ‌.. ఈ సారి మొబైల్ రీచార్జ్‌ల వంతు, ఎంత పెర‌గ‌నున్నాయంటే
Recommended image2
Gold SIP: బంగారాన్ని ఎప్పుడూ ఇలానే కొనండి.. ఫ్యూచర్ కు ఇదే పెట్టుబడి, భరోసా
Recommended image3
Economic Crisis: కష్టకాలంలోనూ సేఫ్ జోన్‌లో ఉండాలా? ఈ నాలుగు గోల్డెన్ రూల్స్ మీ కోసమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved