MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Rate: ఏప్రిల్ 22 నాటికి బంగారం ధర రూ. 65,000 దాటడం ఖాయం..కారణాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Gold Rate: ఏప్రిల్ 22 నాటికి బంగారం ధర రూ. 65,000 దాటడం ఖాయం..కారణాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

అక్షయ తృతీయ నాటికి బంగారం ధర తులం రూ. 65,000 దాటుతుందా అనే సందేహం కస్టమర్లను  వేధిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బంగారం ధర జోరు మీద ఉంది ప్రస్తుతం రూ. 62,000 దాటిపోయింది. మంగళవారం మార్కెట్లో బంగారం 24 క్యారెట్లకు గాను 10 గ్రాముల ధర 62170 రూపాయలు పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం సైతం 60000 దాటిపోయింది. ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ రోజు గోల్డ్ షాపింగ్ చేసేవారికి పెరిగిన ధరలు షాక్ కొట్టిస్తున్నాయి. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Apr 11 2023, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అక్షయ తృతీయ రోజు బంగారం ధర రూ. 65,000 దాటిపోతుందని, ఇప్పటికే బులియన్ విశ్లేషకులు  చెబుతున్నారు. అయితే ఎందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే బంగారం ధర అంతర్జాతీయంగా కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో ఒక ఔన్స్ అంటే 31 గ్రాముల బంగారం ధర 2000 డాలర్లు దాటిపోయింది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే మరో వారం రోజుల్లో బంగారం ధర రూ. 65, 000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

మరి ఈ నేపథ్యంలో అక్షయ తృతీయ రోజు బంగారం ఎలా కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.  అయితే ఇప్పటికే పలు బంగారు దుకాణాల వాళ్ళు పది రోజుల ముందు నుంచే బంగారు నాణేల బుకింగ్స్ ను ప్రారంభిస్తున్నారు. అంటే ప్రస్తుత ధర వద్ద బుక్ చేసుకొని అక్షయ తృతీయ రోజు డెలివరీ పొందే అవకాశం కల్పిస్తున్నారు. . ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం ధర సుమారు రూ. 65000 దాటే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 
 

35

మరోవైపు అంతర్జాతీయంగా గమనించినట్లయితే బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం డాలర్ పరిస్థితి రోజురోజుకు బలహీనపడటం కూడా గమనించవచ్చు. ఇతర కరెన్సీలతో పోల్చి చూసినట్లయితే డాలర్ ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ,  ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా మధుపరులు సురక్షితమైన పెట్టుబడి సాధనమైన బంగారంలో తమ పెట్టుబడులను పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

45

మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వు మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే వార్తలు కూడా మార్కెట్లను కుదిపేస్తున్నాయి. నిజానికి డాలర్ ఎంత బలపడితే బంగారం ధర అంత తగ్గుతుంది. ఎందుకంటే అమెరికన్ బాండ్ మార్కెట్లపై మధుపరులకు విశ్వాసం పెరిగి తమ పెట్టుబడులను  డాలర్ బాండ్ల రూపంలో పెడుతూ ఉంటారు.  అయితే ప్రస్తుతం బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా డాలర్ పై విశ్వాసం సన్నగిల్లి మధుపరులు బంగారంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే బంగారం అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనం.

55

ఈ కారణంగా బంగారం ధర  అటు ఫ్యూచర్స్ ట్రేడింగ్ తో పాటు బంగారం ధర కూడా భారీగా పెరుగుతుంది.  ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 65000 దాటడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయడంపై మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

About the Author

KA
Krishna Adhitya
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పటినుంచో తెలుసా?
Recommended image2
Gold Price Hike: పసిడి ప్రియులకు బిగ్ షాక్...మళ్లీ ఆకాశాన్నింటిన బంగారం ధరలు
Recommended image3
Heat Insurance: ఎండ తీవ్రత పెరిగితే చాలు.. ఆటోమేటిక్‌గా మీ అకౌంట్లోకి డబ్బులు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved