బంగారం, వెండి ధరలు.. 5 రోజుల్లో ఎంత తగ్గిందంటే.. రాఖీ పండగ నాటికీ తులం ఎంతంటే..?
గత 24 గంటల్లో 24 క్యారెట్/ 22 క్యారెట్ (10 గ్రాములు) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆగస్టు 28 (సోమవారం) నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 58,720 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 53,790. మరోవైపు వెండి రూ.500 పెరిగి 1 కేజీకి రూ.76,900 వద్ద ఉంది.
ప్రముఖ నగరాల్లో కూడా బంగారం ధరల్లో ఈ రోజు మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,600 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 54,650. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 59,450 కాగా, 22 క్యారెట్ల(10 గ్రాములు) ధర రూ. 54,500.
మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,450 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,500గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్లు (10 గ్రాములు)కి రూ.57,490 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.54,750గా ఉంది.
ఒరిస్సాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.59,450 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,500.
0105 GMT నాటికి స్పాట్ బంగారం ఔన్సుకు $1,915.79 డాలర్ల వద్ద, US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $1,943.60 డాలర్లకి చేరుకుంది,
స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి $24.30 డాలర్లకి చేరుకుంది. ప్లాటినం $944.21 డాలర్ల వద్ద స్థిరపడింది. పల్లాడియం 0.7 శాతం ఎగిసి $1,232.39 డాలర్లకి చేరుకుంది.
ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.76,900గా ఉంది. చెన్నైలో 1 కిలో వెండి ధర రూ.80,000 వద్ద ట్రేడవుతోంది.
పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో హైదరాబాద్‌లతో రూ.59,450 వద్ద ఉంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 వద్ద ఉంది. కిలో వెండి ధర కకేజీకి రూ.80,000 వద్ద ఉంది.
అయితే బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను ధరలు వీటిని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుంచుకోవాలి.