దీపావళి తర్వాత బంగారం ధరలు మరింత పెరగనున్నాయా.. కొనడానికి మంచి టైం ఎప్పుడు..?
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదం కారణంగా బంగారం ధరలు ర్యాలీని కొనసాగిస్తున్నాయి. శుక్రవారం (నవంబర్ 17) బంగారం, వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. 'ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్' (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.473 పెరిగింది. కాబట్టి 10 గ్రాముల బంగారం ధర రూ.61,170. వెండి కూడా కిలోకు రూ.355 పెరిగి రూ.73,747కి చేరుకుంది.
gold
నవంబర్ నెలలో ఇప్పటివరకు పసిడి వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. నవంబర్ 1న రూ.60,896 ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.61,170కి చేరింది. వెండి ధర ఇప్పటివరకు రూ.2,385 పెరిగింది. నవంబర్‌కు ముందు కిలో వెండి ధర రూ.70,285 ఉండగా, ఇప్పుడు రూ.73,747కి చేరుకుంది.
బంగారం ధర మరింత పెరగనుందా
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ హెడ్ (కమోడిటీ మరియు కరెన్సీ) అనూజ్ గుప్తా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో బాండ్ ఈల్డ్స్ తగ్గుదల, డాలర్ తగ్గుదల రాబోయే కాలంలో బంగారం ధరను మరింత పెంచే అవకాశం ఉంది అన్ని అన్నారు.
65 వేలకు బంగారం?
రానున్న పండుగల కారణంగా దేశీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఈ కారణాల వల్ల డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం 10 గ్రాములకు 65,000, వెండి కిలో 75,000కు చేరే అవకాశం ఉంది.
క్యారెట్ ప్రకారం బంగారం ధర
24 క్యారెట్ ~ 60,978
22 క్యారెట్ ~ 55,856
18 క్యారెట్ ~ 45,734
నవంబర్ 18న ఈరోజు ఢిల్లీలో బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 600 పెంపుతో రూ. 56,700, 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 600 పెంపుతో రూ. 61,790, దేశ రాజధాని నగరంలో వెండి ధర కిలోకు రూ.76,500.
విజయవాడలో బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెంపుతో రూ. 56,550, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెంపుతో రూ. 61,690. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర రూ.1500 పెంపుతో కిలోకి రూ. 79,500
నేడు హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలు పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెంపుతో రూ. 56,550 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 650 పెంపుతో రూ. 61,690. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 79,500.
బంగారం కొనేటప్పుడు జాగ్రత్త
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌తో ధృవీకరించబడిన బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయండి. ఆధార్ కార్డ్‌లో 12 అంకెల కోడ్ ఉన్నట్లే, బంగారానికి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేదా HUID అనే ఆరు అంకెల హాల్‌మార్క్ ఉంటుంది. ఈ నంబర్ ఆల్ఫాన్యూమరిక్ లాగా ఉంటుంది - AZ4524. హాల్‌మార్కింగ్ ద్వారా బంగారం ఎన్ని క్యారెట్లలో ఉందో తెలుసుకోవచ్చు.