బంగారం వెండి కొనేవారికి అలెర్ట్.. ఈరోజు తులం ధర నిన్నటితో పోల్చితే పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..
ఒక నివేదిక ప్రకారం, గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగింది, దింతో పది గ్రాముల ధర రూ. 61,040కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.55,950 వద్ద ఉంది. ఇక వెండి ధర రూ. 1,700 పెరిగి ఒక కిలోకి రూ. 74,700కి చేరింది.
gold
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్ ధరలకు సమానంగా రూ.61,040 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,190,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,580గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లతో సమానంగా రూ.55,950 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,450గా ఉంది.
0128 GMT నాటికి, స్పాట్ గోల్డ్ ఔన్సుకు $1,958.79 వద్ద కొద్దిగా మారింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి $1,961.70కి చేరాయి.
స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 23.39 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.3 శాతం తగ్గి 893.37 డాలర్లకు చేరుకుంది. పల్లాడియం ఔన్సుకు $1,031.40 వద్ద స్థిరపడింది.
ఢిల్లీ, ముంబైలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.74,700గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,700 వద్ద ట్రేడవుతోంది.