Gold Price: శ్రావణమాసం ప్రారంభానికి ముందే బంగారం ధర ఏకంగా రూ. 11,365 పతనం..నమ్మబుద్ధి కావడం లేదా..?
బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయంగా గమనించినట్లయితే పసిడి ధరలు గడచిన రెండు వారాలుగా భారీగా తగ్గాయి. ప్రధానంగా గమనించినట్లయితే బంగారం ధరలు అత్యధిక స్థాయి నుంచి తగ్గుతూ వస్తూ ఉన్నాయి.
గతవారం పసిడి ధర అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ ధర 1945 డాలర్లు పలికింది. ప్రస్తుతం ఈ ధర 1913 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. దీన్నిబట్టి పసిడి ధర ఏ రేంజ్ లో తగ్గిందో అర్థం చేసుకోవచ్చు. అంటే గడచిన ఐదు రోజుల వ్యవధిలో బంగారం ధర ఏకంగా 22 డాలర్లు తగ్గింది. మన భారతీయ కరెన్సీలో చూసినట్లయితే 1825 రూపాయలు తగ్గింది.
ఇదిలా ఉంటే బంగారం ధరలు గత మూడు నెలల డేటా గమనించినట్లయితే భారీగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధర ఒక ఔన్స్ 2050 డాలర్లు పలికింది. అక్కడ నుంచి బంగారం ధర వరుసగా పతనం అవుతూ ప్రస్తుతం 1913 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 137 డాలర్లు పతనం అయింది. దీన్ని భారతీయ కరెన్సీలో చూసినట్లయితే 11,365 రూపాయలు తగ్గింది. ట్రెండు ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే బంగారం ధర 1900 డాలర్ల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక దేశీయంగా గమనించినట్లయితే మన దేశంలో కూడా అత్యంత శుభప్రదమైనటువంటి శ్రావణమాసం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశీయంగా గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60000 దిగువన ట్రేడ్ అవుతోంది.
అంతేకాదు బంగారం ధరలు దేశీయంగా మరింత తగ్గి వచ్చే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అని అంచనా వేస్తున్నారు. అమెరికా బాండ్ మార్కెట్లో యూఎస్ బాండ్ యీల్డ్స్ విలువ పెరుగుతోందని. ఫలితంగా పెట్టుబడిదారులంతా తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి ఎక్కువగా లాభాలు ఇచ్చే అమెరికా బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫలితంగా అటు అమెరికా మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇటు దేశీయంగా కూడా స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గి వస్తున్నాయి ఫలితంగా బంగారు ఆభరణాలు చేయించుకునే వారికి ఇది ఒక రకంగా లాభం అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధర తగ్గే కొద్దీ నగల ధరలు కూడా తగ్గుతాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 55000 దిగువకు వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెంచుతుంది అనే అంచనాలు వస్తున్నాయి ఇదే కనుక జరిగినట్లయితే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.