- Home
- Business
- Gold Rate: రాకెట్ వేగంతో పెరుగుతున్న బంగారం ధర, త్వరలోనే తులం రూ.70 వేలు అయ్యే చాన్స్...
Gold Rate: రాకెట్ వేగంతో పెరుగుతున్న బంగారం ధర, త్వరలోనే తులం రూ.70 వేలు అయ్యే చాన్స్...
Gold Rate: భారత బులియన్ మార్కెట్‌లో, వారం చివరి ట్రేడింగ్ రోజున అంటే శుక్రవారం, బంగారం మరియు వెండి ధరలలో పెరుగుదల కనిపించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర రూ.416 పెరగగా.. ఈరోజు వెండి ధర రూ.1,014 పెరిగింది.

ఈరోజు బంగారం ధర ఎంతో తెలుసా?
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.416 పెరిగి 10 గ్రాములకు రూ.50,802 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50,386 వద్ద ముగిసింది.
ఈరోజు వెండి ఎంత పెరిగింది...
ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,014 పెరిగి రూ.61,343 వద్ద ముగిసింది. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో గత ట్రేడింగ్ సెషన్‌లో కిలో వెండి ధర రూ.60,329 వద్ద ముగిసింది.
FY22లో బంగారం దిగుమతులు 33.34 శాతం పెరిగాయి
గత ఆర్థిక సంవత్సరం 2021-22లో దేశంలో బంగారం దిగుమతులు 33.34 శాతం పెరిగి 46.14 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. అధికారిక సమాచారం ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క బంగారం దిగుమతి 34.62 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, భారతదేశంలో మాత్రం బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో, బంగారం ఆగస్టు ఫ్యూచర్స్ రూ. 231 లేదా 0.5 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 50,669 వద్ద ట్రేడవుతోంది. U.S. ఫెడరల్ రిజర్వ్ నుండి పెద్దగా ఊహించిన వడ్డీ రేటు పెంపు ప్రకటనతో స్పాట్ బంగారం ఔన్సుకు 1,832.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. U.S. బంగారం ఫ్యూచర్స్ 1% పెరిగి 1,836.90 డాలర్లకి చేరుకుంది.
US ఫెడ్ వడ్డీ రేటులో 75 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించింది, తదుపరి సమావేశంలో 50 bp లేదా 75 bp రేటు పెంచే వీలుందని సూచనలు చేశారు. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యలతో బంగారం మార్కెట్లో పదునైన ర్యాలీకి దోహదపడింది. అయితే త్వరలోనే బంగారం ఔన్స్ ధర 1850 డాలర్లకు చేరే అవకాశం ఉంది.
ఇక దేశీయంగా చూసినట్లయితే బంగారం ధరలు చుక్కలను తాకే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం ధర రిటైల్ మార్కెట్ లో రూ. 60 వేలు తాకే అవకాశం కనిపిస్తోంది. అంతే కాదు, మున్ముందు ఫెస్టివల్ సీజన్ లో బంగారం ధర మరింత పెరిగే చాన్స్ లు ఉన్నాయి. ఫలితంగా తులం బంగారం రూ. 70 వేలు అయ్యే అవకాశం లేకపోలేదని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
తులం బంగారం రూ. 70 వేలు అయ్యే చాన్స్...
ఇక దేశీయంగా చూసినట్లయితే బంగారం ధరలు చుక్కలను తాకే అవకాశం ఉంది. ముఖ్యంగా బంగారం ధర రిటైల్ మార్కెట్ లో రూ. 60 వేలు తాకే అవకాశం కనిపిస్తోంది. అంతే కాదు, మున్ముందు ఫెస్టివల్ సీజన్ లో బంగారం ధర మరింత పెరిగే చాన్స్ లు ఉన్నాయి. ఫలితంగా తులం బంగారం రూ. 70 వేలు అయ్యే అవకాశం లేకపోలేదని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
బంగారం ధరల పెరుగదలకు కారణం లేకపోలేదు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుదల మూలంగా, సెంట్రల్ బ్యాంకులన్నీ వరుసగా కీలక వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. RBI సహా ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా బంగారం వైపు పెట్టుబడులు తరలిపోవడం ఖాయంగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ అనిశ్చితిలో బంగారం లాంటి అసెట్ క్లాసెస్ ను సేఫెస్ట్ పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో పసిడికి డిమాండ్ అమాంతం పెరిగిపోతోంది.