హమాస్-ఇజ్రాయెల్ వార్.. పెరిగిన బంగారం వెండి ధరలు.. ఇవ్వాల ఒక్కరోజే తులం ఎంత పెరిగిందంటే..?
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ ఎగిశాయి. దింతో చమురు ధరలను అలాగే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ ప్రభావితం చేసింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఈరోజు ప్రారంభంలో బ్యారెల్‌కు 4.18 లేదా దాదాపు 5 శాతం పెరిగి $88.76కి చేరుకుంది. మరోవైపు, US WTI క్రూడ్ బ్యారెల్ స్థాయికి 5.1 శాతం పెరిగి 87.02 డాలర్లకు చేరుకుంది.
ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పెరుగుతున్న మరణాల సంఖ్యతో యుద్ధం తీవ్రతరం కావడంతో బంగారం మరింత లాభపడవచ్చు అని షేర్‌ఖాన్‌లోని ఫండమెంటల్ కరెన్సీలు అండ్ కమోడిటీస్ అసోసియేట్ VP ప్రవీణ్ సింగ్ అన్నారు.
ఒక నివేదిక ప్రకారం, సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 440 పెరిగింది, దింతో పది గ్రాముల పసిడి ధర రూ. 57,980 ఎగబాకింది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా ఒక కిలో ధర రూ.72,100గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.53,150కి చేరుకుంది.
ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్ ధరలతో సమానంగా రూ.57,980గా ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,130,
బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,980,
చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,580గా ఉంది.
ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కోల్‌కతా, హైదరాబాద్‌లో బంగారం ధరతో సమానంగా రూ.53,150 వద్ద ఉంది.
ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర వరుసగా రూ.53,300,
బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,150,
చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,700గా ఉంది.
0056 GMT నాటికి స్పాట్ గోల్డ్ 1 శాతం పెరిగి ఔన్సుకు $1,850.87కి చేరుకుంది. యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి ఔన్సుకు 1,865.20 డాలర్లకు చేరుకుంది.
ఇతర లోహాలలో, స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 1.6 శాతం పెరిగి $21.94కు చేరుకోగా, ప్లాటినం 0.6 శాతం పెరిగి $881.83కి, పల్లాడియం 0.5 శాతం పెరిగి $1,163.49కి చేరుకుంది.
ప్రస్తుతం చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000గా ఉంది.
వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 75,000.