పోస్టాఫీసులో కేవలం రూ.399 కే రూ.లక్షల విలువైన ప్రమాద బీమా ఉంది తెలుసా?
పోస్టాఫీసులో అనేక చక్కటి పథకాలు రిస్క్ లేని బెనిఫిట్స్ ఇస్తాయి. ఇలాంటి పథకాలతో పాటు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా తక్కువ ప్రీమియంకే మీరు పొందొచ్చు. అందరికీ ఉపయోగపడే అలాంటి ప్రమాద బీమా గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భారత ప్రభుత్వ తపాలా శాఖ (ఇండియా పోస్ట్) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ద్వారా టాటా AIG సహకారంతో ప్రమాద బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకం కింద మీరు సంవత్సరానికి రూ. 399 ప్రీమియం చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణం సంభవించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా రూ. 10 లక్షల బీమా సౌకర్యం పొందవచ్చు.
ఈ పాలసీ తీసుకున్న వారు ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు వారి కుటుంబానికి ఇస్తారు. అదే వ్యక్తి యాక్సిడెంట్ లో శాశ్వతంగా వైకల్యం పొందినా కూడా రూ.10 లక్షలు ఇస్తారు. అంతే కాకుండా పర్మనెంట్ గా పార్షియల్ డిసబులిటీ ఏర్పడినా బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10 లక్షలు పాలసీ డబ్బు ఇస్తారు.
ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ప్రమాదంలో చేతులు, కాళ్లు పడిపోయినా పోస్టల్ శాఖ రూ.10 లక్షలు ఇస్తుంది. ఇవే కాకుండా జరిగిన ప్రమాదం వల్ల పాలసీ తీసుకున్న వ్యక్తి హాస్పటల్ లో చేరితే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కింద రూ.60 వేలు కూడా ఇస్తారు. దీనికి తోడు హాస్పటల్ లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున ఇస్తారు.
కేవలం రూ.399 ప్రీమియంతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న యాక్సిడెంటల్ పాలసీని మీరు ఎక్కడా చూసి ఉండరు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా ఈ ప్రమాద బీమా అందిస్తోంది. ఈ పాలసీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలంటే మీ సమీపంలోని పోస్టాఫీస్ కు వెళ్లి రూ.399 పాలసీ వివరాలు కనుక్కోండి.