ఇంధన ధరల అప్ డేట్.. ఏడాదికి పైగా దిగిరాని పెట్రోల్ డీజిల్.. నేడు ఒక లీటరు ధర ఎంతంటే..?
దేశంలోని ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ డీజిల్ ధరలను సమీక్షిస్తాయి. ఎప్పటిలాగే ఈరోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు అప్‌డేట్ చేయబడ్డాయి. గత ఏడాది మే 2022లో ఇంధన ధరలను జాతీయ స్థాయిలో సవరించారు.
. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధర ఆధారంగా ఇవి నిర్ణయించబడుతుంది. ఇందులో పన్నులు, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. దీనివల్ల ఒక్కో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధర ఒక్కో విధంగా ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రుడైయిల్ ధరల్లో ఈరోజు స్వల్ప తగ్గుదల కనిపించింది. దీని ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై అంతగా కనిపించలేదు. ఈరోజు WTI క్రూడ్ ఆయిల్ ధర 0.43 శాతం పెరిగి $ 88.90 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 0.40 శాతం పెరిగి బ్యారెల్కు $ 92.25 డాలర్ల వద్ద ఉంది. పెట్రోల్ డీజిల్ తాజా ధరలను BPCL , ఇండియన్ ఆయిల్ అండ్ HPCL విడుదల చేస్తాయి. దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సెప్టెంబర్ 14న పెట్రోల్ డీజిల్ తాజా రేట్లను విడుదల చేశాయి.
నాలుగు ప్రముఖ మెట్రో నగరాల్లోని ధరలు:
ఢిల్లీలో పెట్రోలు ధర రూ .96.72 , డీజిల్ ధర లీటరుకు రూ .89.62
ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర లీటరుకు రూ .94.27
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర లీటరుకు రూ .92.76
చెన్నైలో పెట్రోల్ ధర రూ .102.63 , డీజిల్ ధర రూ .94.24
ఇతర నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు
పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04
లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.47, డీజిల్ ధర రూ.89.66
హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82
చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26
నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.97.00, డీజిల్ ధర రూ.90.14
గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ.97.04, డీజిల్ ధర రూ.89.91
బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89
మీరు పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. BPCL కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్ వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.