MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఫోన్ ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఎలాంటి యాప్ అవసరం లేకుండా ఈ టిప్ తో కనిపెట్టొచ్చు

ఫోన్ ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఎలాంటి యాప్ అవసరం లేకుండా ఈ టిప్ తో కనిపెట్టొచ్చు

మీరు ఫోన్ సైలెంట్ లో పెట్టి ఇంట్లోనే ఎక్కడ పెట్టారో మర్చిపోయారా? ఈ చిన్న ట్రిక్ తో మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ఇట్టే కనిపెట్టొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలో తెలుసుకుందాం రండి.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 22 2025, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండే పరిస్థితి లేదు. ప్రతి చిన్న అవసరానికి ఫోన్ అత్యవసరమైపోయింది. టైమ్ చూడాలన్నా గోడ మీద ఉన్న గడియారాన్ని వదిలేసి జేబులో ఉన్న సెల్ తీసి చూసుకొనే పరిస్థితి వచ్చేసింది. ఖాళీగా ఉంటే  చాలా మంది వాట్సాప్, యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ లాంటి యాప్స్ ఓపెన్ చేసి మెసేజ్ లు, వీడియోలు, షార్ట్స్ చూస్తుంటారు. 
 

25

కొంచెం సేపు ఫోన్ జేబులో ఉంటే దాన్ని మర్చిపోయామన్నట్టుగా వరుసగా వచ్చే నోటిఫికేషన్స్  మన ఫోన్ ఎక్కడుందో ఇట్టే చెప్పేస్తాయి. పొరపాటున ఒక్క నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే కనీసం గంట సేపు టైమ్ అంతా గడిచిపోతుంది. అలాంటిది కొంచెం సేపు ఫోన్ కనిపించకపోతే ఎవరైనా ఉండగలరా?

మీటింగ్ లో ఉండటం వల్లనో, దేవాలయాలకు వెళ్లిన సమయంలోనో ఫోన్ సైలెంట్ లో పెడుతుంటాం. కాని ఇంటికి వచ్చినా సైలెంట్ మోడ్ లోంచి తీయడం మర్చిపోయి ఎక్కడో పెట్టేస్తాం. తీరా దాని కోసం ఎంత వెతికినా ఒక్కోసారి అస్సలు కనిపించదు. ఇల్లంతా చిందరవందర చేసి వెతికినా ఒక్కోసారి కనిపించదు. 
 

35

సాధారణంగా ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే కొన్ని ప్రత్యేక యాప్స్ ఉన్నాయి. వాటిని ఇన్‌స్టాల్ చేసుకొంటే ఫోన్ కనిపెట్టడం ఈజీ అవుతుంది. కొన్ని యాప్స్ వేసుకొంటే క్లాప్స్ కొట్టగానే ఫోన్ నుంచి రిప్లై సౌండ్ వస్తుంది. అప్పుడు ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. అదేవిధంగా మరికొన్ని యాప్స్ విజిల్ సౌండ్ చేసేలా రూపొందాయి. 

అయితే ఎలాంటి యాప్స్ ఉపయోగించకుండా ఫోన్ ను కనిపెట్టే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా చేస్తే ఫోన్ సైలెంట్ లో ఉన్నా, వైబ్రేషన్ లో ఉన్నా ఫోన్ ను ఈజీగా కనిపెట్టవచ్చు. 
 

45

మీ ఫోన్ సైలెంట్ లో గాని, వైబ్రేషన్ లో గాని పెట్టి ఇంట్లోనే ఎక్కడో మర్చిపోయారనుకోండి. 
వేరే వాళ్ల ఫోన్ తీసుకొని గూగుల్ ఓపెన్ చేయండి.
సెర్చ్ లో Find my device అని టైప్ చేయండి.
మొదట్లోనే Android Find My Device అని లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
తర్వాత Sign in ఆప్షన్ పై క్లిక్ చేయండి.

55

తర్వాత Email or phone number ఎంటర్ చేయాల్సిన ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఎవరి ఫోన్ అయితే కనిపించడం లేదో వారి ఈమెయిల్ కాని ఫోన్ నంబర్ కాని ఎంటర్ చేయండి. 
తర్వాత పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
అప్పుడు ఓపెన్ అయిన పేజీలో Play sound ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
అంతే మీ ఫోన్ ఎక్కడున్నా వెంటనే రింగ్ అవుతుంది. మీ ఫోన్ సైలెంట్ లో ఉన్నా, వైబ్రేషన్ లో ఉన్నా రింగ్ అవుతుంది. దీంతో ఈజీగా దొరుకుతుంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price: గుడ్ న్యూస్.. పసిడి ధర ఎంత తగ్గిందంటే...?
Recommended image2
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image3
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved