MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • మీకు ఫ్రీ యాక్సిడెంటల్ పాలసీ ఉందని తెలుసా? డెబిట్ కార్డున్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది

మీకు ఫ్రీ యాక్సిడెంటల్ పాలసీ ఉందని తెలుసా? డెబిట్ కార్డున్న ప్రతి ఒక్కరికీ ఇది వర్తిస్తుంది

మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే రూ.లక్షల విలువైన ఫ్రీ యాక్సిడెంటల్ పాలసీ మీకు వర్తిస్తుందని మీకు తెలుసా? ఈ ప్రమాద బీమా గురించి చాలా మందికి తెలియదు. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు తెలుసుకొని మీకు తెలిసిన వారందరికీ తెలియజేయండి. ఈ పాలసీ ఇబ్బందుల్లో ఉన్న ఏ కుటుంబానికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.  

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Dec 15 2024, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా బ్యాంకు అకౌంట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ డెబిట్ వాడుతుంటారు కదా.. డెబిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరికీ యాక్సిడెంటల్ పాలసీ వర్తిస్తుంది. అయితే ఇది ఆయా బ్యాంకుల రూల్స్ కి అనుగుణంగా ఉంటుంది. చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాయి. కాని ఈ విషయం వారికి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా బ్యాంకులు ఈ విషయాన్ని కస్టమర్లకు చెప్పడాన్ని పెద్ద విషయంగా చూడవు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే బాధితులు ఆ బాధలో ఉంటారు తప్ప.. బ్యాంకులు ఇచ్చే బీమా పాలసీల గురించి ఆలోచించలేరు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బ్యాంకులు ఇచ్చే ప్రమాద బీమా కవరేజ్ కూడా ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటుంది. ప్రమాదం జరిగి వ్యక్తి మృతి చెందినా, లేదా వైకల్యం ఏర్పడినా ఈ కవరేజీ లభిస్తుంది. ఈ ప్రమాద బీమా పాలసీ అమౌంట్ బ్యాంకు బట్టి మారుతుంటుంది. చాలా బ్యాంకులు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కవరేజీ ఇస్తాయి. ముఖ్యంగా SBI, HDFC Bankలు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు కవరేజీ ఇస్తున్నాయి. అదే ICICI బ్యాంకు అయితే రూ. 2 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ప్రమాద బీమా ఇస్తోంది. Axis Bank రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు యాక్సిడెంటల్ పాలసీ అందిస్తోంది. 
 

35

ప్రమాద బీమా పాలసీ కవరేజ్ వివిధ రకాల డెబిట్ కార్డ్ లకు వేర్వేరుగా ఉంటుంది. అంటే రెగ్యులర్ డెబిట్ కార్డు అయితే ఒకలా, ప్రీమియం, ప్లాటినం కార్డ్ అయితే  కొంచెం ఎక్కువ ప్రమాద బీమా కవర్ అవుతుంది. ప్రమాద బీమా పొందాలంటే పాలసీ షరతులు, కవరేజీ, క్లెయిమ్ ప్రాసెస్ గురించి మీరు ముందే అవగాహన కలిగి ఉండటం మంచిది. ప్రతి ఒక్క బ్యాంకు పాలసీ కవరేజీ, క్లెయిమ్ ప్రాసెస్‌లో తేడాలు ఉంటాయి కాబట్టి ఈ వివరాలు కచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం.
 

45

డెబిట్ కార్డ్ ద్వారా యాక్సిడెంటల్ పాలసీ పొందడానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా డెబిట్ కార్డ్ యాక్టివ్‌గా ఉండాలి. అంటే గడచిన 3 నెలల్లో ఈ డెబిట్ కార్డు ద్వారా కనీసం ఒక ట్రాన్సాక్షన్ అయినా చేసి ఉండాలి. ఈ పాలసీ పొందడానికి ప్రత్యేకంగా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డు రెగ్యులర్ గా వాడుతుంటే 
చాలు ఆ పాలసీ వర్తిస్తుంది. 

అంతేకాకుండా అకౌంట్ ఉన్న బ్యాంకు రూల్స్ ప్రకారం మినిమం బాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. 
 

55

అకౌంట్ హోల్డర్ యాక్సిడెంట్ లో చనిపోయారన్న విషయాన్ని ఒక నెలలోపు ఆ బ్యాంకు అధికారులకు తెలియజేయాలి. వారిచ్చిన దరఖాస్తు ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. బ్యాంకు వాళ్లు అడిగిన డాక్యుమెంట్లు, ఆధారాలు 60 రోజుల్లోపే బ్యాంకుకు ఇవ్వాలి. టైమ్ దాటిన తర్వాత ఇస్తే బ్యాంకులు రిజక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 

సాధారణంగా బ్యాంకులు అడిగే డాక్యుమెంట్లు ఏంటంటే.. పోలీస్ కంప్లైంట్ లేదా FIR కాపీ, హాస్పిటల్ బిల్స్, ఓపీ, డెబిట్ కార్డ్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ స్టేట్‌మెంట్, డెత్ సర్టిఫికేట్. ఇవన్నీ ముందుగానే సిద్ధం చేసుకొని బ్యాంకుకు సకాలంలో అందిస్తే మీరు పాలసీ క్లెయిమ్ కి అప్లై చేసిన 14 రోజుల్లోనే మీ అప్లికేషన్ ప్రాసెస్ జరిగి పాలసీ అమౌంట్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అందుతుంది. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రెండో రోజు తగ్గిన బంగారం, వెండి
Recommended image2
OPPO Enco Air5 Pro: నాయిస్ క్యాన్సిలేషన్ నెక్స్ట్ లెవెల్ కిర్రాక్ ఇయర్‌బడ్స్.. OPPO నుంచి దుమ్ములేపే Enco Air5 Pro వచ్చేసింది
Recommended image3
Bank Rules: బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ఫీజు ఎందుకు వసూలు చేస్తాయో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved