రూ. 10 లక్షలను రూ. 1 కోటిగా చేయాలని ఉందా...అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి మరిచిపోండి..కోటీశ్వరుడు అవడం ఖాయం..
మీ వద్ద పది లక్షల రూపాయల మొత్తంలో డబ్బు ఉందా అయితే ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా. బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేద్దామా… లేక మ్యూచువల్ ఫండ్స్ లో డిపాజిట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారా అయితే ఎందులో మీ డబ్బును దాచుకుంటే సురక్షితము ఎందులో ఎక్కువ రాబడి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాధారణంగా వ్యాపారంలో లాభం దక్కినప్పుడు, లేదా భూములు అమ్మినప్పుడు, లేదా మరే ఇతర పెట్టుబడుల పైన అయినా మీకు మంచి లాభం దక్కినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది. అలాగే కొన్నిసార్లు రిటైర్మెంట్ సమయంలో కూడా మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచించడం సహజమే. ఉదాహరణకు ఒక పది లక్షల రూపాయలు మీ చేతికి వచ్చాయి అనుకుందాం అప్పుడు ఆ డబ్బులు ఎందులో ఇన్వెస్ట్ చేయాలో చాలామందికి తెలియక తికమక పడుతూ ఉంటారు.
కొంతమంది ఆ ఆ పది లక్షల రూపాయలను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చేతులు దులుపుకుంటారు, మరి కొంతమంది నగర శివారులో ఫ్లాట్ కొని ఇన్వెస్ట్ చేస్తారు. మరి కొంతమంది ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెడతారు. అలాగే ఆ పది లక్షల రూపాయలను సురక్షితంగా పోస్ట్ ఆఫీస్ లో కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో దాచుకుంటారు. కానీ మీ పది లక్షల రూపాయలకు ఇన్వెస్ట్ చేసి ఒక కోటి రూపాయలను సంపాదించే వీలుంది. ఎలాంటి వ్యాపారం చేయకుండానే. ఎలాంటి ఆస్తులను కొనుగోలు చేయకుండానే మీ పది లక్షల రూపాయలను ఒక కోటి రూపాయలుగా చేసే సాధనం ప్రస్తుతం అందుబాటులో ఉంది.
మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభం పొందే అవకాశం ఉంది. ఒకవేళ మీ చేతులు 10 లక్షల రూపాయల మొత్తం డబ్బు ఉన్నట్లయితే వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక కోటి రూపాయలను సంపాదించవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
10 లక్షల రూపాయలను మార్కెట్లో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, వాటిని 20 సంవత్సరాల పాటు అలాగే హోల్డ్ చేసి, సాలీనా 12 శాతం చొప్పున రిటర్న్ పొందినట్లయితే మీకు కనీసం 96,46,293 రూపాయలు దక్కే అవకాశం ఉంది. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇది సాధ్యం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టిన డబ్బులు ఫండ్ మేనేజర్లు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ రీసెర్చ్ చేయడం ద్వారా మంచి స్టాక్స్ లో మీ డబ్బులు పెట్టుబడిగా పెడతారు తద్వారా లాంగ్ టర్మ్ లో చక్కటి రాబడి సొంతం అయ్యే అవకాశం ఉంది.
మీరు 10,00,000 రూపాయలను 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 12 శాతం సాలీనా రిటర్న్ ఆశించినా 86,46,293 రూపాయలు మీకు దక్కే అవకాశం ఉంది. మీ పెట్టుబడి రూ. 10 లక్షలను ఆ మొత్తానికి కలిపినట్లయితే, (86,46,293 + 10,00,000) 96,46,293 పొందే వీలుంది.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు రిస్కుతో కూడికున్నవి. స్టాక్ మార్కెట్ లాభనష్టాలకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావితం అవుతుంటాయి. కావున మీరు పెట్టుబడి పెట్టేముందు నిబంధనలు పూర్తిగా తెలుసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం ఉత్తమం. మీ పెట్టుబడులకు లాభనష్టాలకు ఏషియా నెట్ న్యూస్ ఎలాంటి బాధ్యత వహించదు.